పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాలేదు. అయినా, కార్నెగీ తప్పనిసరి అయి తాను తీసుకోటానికి నిశ్చయించుకొన్న చర్యను అసహ్యించుకున్నాడు. తన స్టాకును యితర భాగస్థులకు అమ్మి కంపెనీలోనుంచి ప్రశాంతంగా విరమించుకోమని అతడు ఫ్రిక్స్‌కు సూచన చేశాడు. అందుకు ఫ్రీక్స్ నిరాకరించాడు. ఈ కారణంగా ఖరీదయిన దావా నడిచింది. అతణ్ని పంపించి వేయటం కోసం రాజీ పడవలసివచ్చింది. చివరకు ఫ్రీక్స్ వెల్లిపోయినాడు. తరువాత ఫ్రిక్స్ కార్నెగీతో సంధియత్నాలు చేశాడు. వా రిరువురూ తిరిగి మిత్రులయినారు. అయినా వెనుకటి సంవత్సరాలలొ కనుపించిన సౌమనస్యం వారికి మళ్ళీ ఎన్నడూ చేకూరలేదు. తన్ను ఎన్నో రెట్లు మించిన కోటీశ్వరుడయి జీవించి మరణించినా ఫ్రీక్స్‌కు తన పథకాలమ నిరంతరం భగ్నం చెయ్యటమే పనిగా పెట్టుకుంటాడని కార్నెగీ అంటే అనిష్టం.

ఈ కలహం కార్నెగీని వ్యథ పెట్టింది. ఒక వంక అతడు వ్యాపారికమయిన బాధ్యతలనుంచి విడుదలపొందాలని అతిగా కుతూహల పడుతున్నాడు. మరొకవంక తన జీవితమంతా దేన్ని సాధించాడో దాన్ని వదలిపెట్టి వెళ్ళిపోవట మన్న భావాన్ని ఎదుర్కో లేక పోతున్నాడు. మహాశక్తిమంతుడయిన జె. పియర్ పాంట్ మోర్గన్ అధ్యక్షాన నడుస్తున్న మోర్గన్ బ్యాంకింగ్ హౌస్ ఉక్కు వ్యాపారపు పెట్టుబడులను కొనటం ప్రారంభించింది. ఈ సమయంలో కార్నెగీ సంస్థకు స్వాబ్ అధ్యక్షుడు. కార్నెగీ సంస్థ ఓహియా రాష్ట్రంలో ఈరి సరస్సు వొడ్డున కోన్నియాట్ దగ్గర క్రొత్త ఉక్కు