పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకట స్థితి - పరిష్కారం

12

కొంత కార్నెగీ వాటాలలో కొన్నింటిని స్టాక్ మార్కెట్టులో ప్రవేశపెట్టేటందుకు యితరుల చేతుల్లోకి - వాస్తవానికి బ్రోకర్ల చేతుల్లోకి. ప్రేవేశపెట్టాలని ఫ్రీక్ ఎప్పుడూ వుద్దేశపడుతుండటం కార్నెగీకి తెలుసు. చివరకు పిట్స్ బర్గు బ్యాంకరయిన ఒక కోటీశ్వరుడికి కార్నెగీ కంపెనీ వారి రెండు శాతం వాటాలను అమ్మి కొన్ని అభివృద్ధులను సాధించవలసిందని కంపెనీ కోశాధికారికి సూచన చేసినప్పుడు, దీనిని మించేటట్లుగా కోక్ ధరను గురించి కార్నెగితో నోటి మాటగా చేసుకొన్న ఒడంబడికను బొత్తిగా త్రోసిపుచ్చినపుడు సహజంగా శాంతస్వభావుడయిన ఆ స్కాబ్ దేశీయుడు వున్మత్తుడయినాడు.

హెన్రీ ఫిప్స్ ఫ్రీక్ పక్షంవహించటం కార్నెగీని అన్నిటికంటె అధికంగా గాయపరచింది. ఫ్రీక్స్‌ను కంపెనీ నుంచి తొలగించాలని నిశ్చయించుకొని 1899 శరత్తులో తీక్షణముఖుడై ఇంటికి తిరిగివచ్చాడు. యింతకు పూర్వం ఎన్నడూ భాగస్థులతో అతనికి తీవ్రమయిన వివాదా లేవీ