పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేయే స్థితిలో వున్నాడు. అది నన్ను బాధ పెడుతున్నది. అతడికి ఎంతమంచి గ్రంథాలయముందో నీకు తెలుసు. చూశావు కూడాను. అయితే, దాని విలువ అంతా అతనికి తిరిగి రాకపోయినప్పటికీ దాన్ని విడిచిపెట్టటమంటే దరిదాపుగా అతని గుండె బ్రద్దలయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ, విక్రయిద్దామనుకుంటున్నాడు.

కార్నెగీ "దాన్ని నేను కొంటాను. అయితే...

గ్లాడ్‌స్టన్ మధ్యలో ఆపి "నన్నొక సూచన చెయ్యనీ, అతని జీవితం పర్యంతం దాన్ని అతనిదగ్గరే ఉండనీ. అతని తదనంతరం దాన్ని నీవు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యనీయ వచ్చు.

ఆ రాజనీతిజ్ఞుడుతొ కరచాలనం చేస్తూ "తప్పక చేస్తాను. మీ సూచనకు నా మనస్సులు."

అక్టన్ చెప్పిన ఖరీదుకు అతడు అతని గ్రంథాలయాన్ని కొన్నాడు. అయితే గ్లాడ్‌స్టన్ చెప్పినటు ఆ ఉదాత్తుడయిన లార్ బహుకాలం జీవించ లేదు. 1902 లోని ఆతని మృతికి పిమ్మట అనతికాలానికే కార్నెగీ మోర్లేలు కలుసుకొన్నారు. కార్నెగీ మిత్రునితొ "మీ కో విషయం చెప్పాలి. కొద్ది సంవత్సరాలకు పూర్వం లార్డు ఆక్టన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతని గ్రంథాలయాన్ని అమ్ముతానని సూచన చేస్తే...

మోర్లేమొగాన ఉదయించిన చిరునవ్వు ఆ వాక్యాన్ని మధ్యలో ఆపింది. "ఈ విషయం మీరు కొన్న రోజునుంచి నే నెరుగుదును" అన్నా డతడు.