పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్నాడు "బిల్ మా మంచి ట్రాల్ మన్ లలో ఒకడు" "హెన్రీకి నాశుభాకాంక్షలను అంద జెయ్యి" - ఈరీతిగా లఘటీకలు వ్రాశాడు.

అంతర్యుద్ధ కాలంనాటి సైన్యములోని టెలిగ్రాఫర్లంటే కార్నెగీకి ప్రీతి విశేషం. అతనికి వారితో కొంత లీలగా సంబంధ మున్నది. వారు నిర్మించుకొన్నదీ చారిత్రక ఖ్యాతిగన్నదీ. ఆయన సమాజంలో కార్నెగీ ఒకప్పుడు సభ్యుడు. కొన్ని మాట్లు వారి వార్షిక సమావేశాలకు హాజరై నాడు. వార్తాహారి బాలుడుగా వున్న తన తొలినాటి అనుభవాలను గురించి అతడు ఆ సభల్లో ప్రసంగించాడు. సైన్యానికి వీరిసేవ అత్యంత ప్రధానమైంది కనుక వీరికికూడా పింఛనులు ఇవ్వాలని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకో లేదు గనుక అతడికి కోపం కలిగింది. సైనికుల లాగానే వీళ్ళల్లో చాలామంది యుద్ధభూమిలో ప్రాణాలను కోల్పోయినారు. వికలాంగులయినారు. గాయాలు తగిలి, వాతావరణం పడక ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారు. శత్రువుల కారాగారాలల్లో బంధితులయినారు. వారిదేశ ప్రభుత్వం దగ్గర నుంచి వారు పుచ్చుకో వలసినంత మొత్తాలు వారికి చెల్లించటానికి వీలు కలిగేటట్లు అతడు 'కార్నెగీ నిధి'ని ఏర్పాటు చేశాడు.

చిత్రమైన చిక్కుల్లో పడ్డ వ్యక్తులమీద కార్నెగీ తప్పనిసరిగా చూపించే దయకు క్రింది దొక ఉదాహరణం మాత్రమే.

మిష్టర్ గ్లాడ్‌స్టన్ ఒకమారు అతనితో అన్నాడు. "మన మిత్రుడు లార్డు అక్టన్ ఆర్థిక సముద్రంలో మునిగి