పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/199

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అనేవాడు. అటువంటి పరిస్థితిలో ఏ కొద్దిమందోతప్ప వేటాడటానికి పూనుకుండేవాళ్లు కారు. మానవులది గాని, జంతువులది గానీ రక్తపాతమంటే కార్నెగీ అసహ్యించుకొనేవాడు.

ఈ మధ్య కాలంలో అతడు నెంపాదిగా చిన్న కళాశాలకు, చర్చిలకు సినొగాగ్‌లకు, ఆర్గనులను కొనుక్కోటానికి, జంతువాద్య సమ్మేళనాలను పెంపొందించుకొనటానికి, గ్రంథాలయాలను నిర్మించుకోటానికి డబ్బు ఇస్తుండే వాడు. స్కిబోకు పదిమైళ్ళ మేరలో వున్న ప్రతి చిన్న గ్రామంలోను, కొన్ని సందర్భాలల్లో ఇంకా చిన్న గ్రామాలల్లోను కార్నెగీ గ్రంథాలయం ఏర్పడింది. అతడు న్యూయార్క్‌లోని కూపర్ ఇన్ట్సిటూట్‌కూ, మర్చంట్స్ అండ్ ట్రేడ్ మన్ ఇన్ట్సిటూషన్‌కు ఒక్కొక్క దానికి 7,50,000 డాలర్లు ఇచ్చాడు. పాత మిత్రత్వాలను అంటిపెట్టు కార్నెగీ 1859 మొదలు 1863 వరకూ పెన్సిల్వేనియా రైల్ రోడ్డు పిట్స్‌బర్గు డివిజనులో తన క్రిందపని చేసిన వారందరికీ పింఛను (Pension) లిచ్చాడు. వారిలో కొందరు సహాయానికి దరఖాస్తులు పెట్టుకొన్నారు. చివరకు అందరినీ వెతికి వారికి, వారి వితంతువులను కూడా కలిపి పింఛనుల పట్టికను తయారు చేయమని తన మిత్రుడయిన టామ్ మిల్లర్‌ను నియమించాడు. "వీరి మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను చిన్న కుర్రవాడను. వీరంతా నా యెడ ఎంతో దయాళువులై ప్రవర్తించారు. వీరు నా ప్రియమిత్రులు" అని వీరిని గురించి వివరించాడు. మిల్లరు ప్రతివ్యక్తిని గురించి రిపోర్టు పంపినప్పుడు చాలా వాటిమీద "జాన్ నా కెంతో బాగా గుర్తు