పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడు. ఇతడు అ ప్రదేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకడు. వీళ్ళందరూ చలికాలాలకు ఆ కుటుంబంతో బాటు అమెరికా వెళ్ళేవాళ్ళు. ఆ ఎస్టేటులోని శ్రామికుల ఉద్యోగాల లాగానే వీరిని కూడా జీవితపర్యంతో ద్యోగాలు.

జూలై నాల్గవ తేదీన అ సౌధంమీద బ్రిటిష్ అమెరికన్ జెండాలు రెండూ ఎగురుతున్నవి. ఈ రీతిగా రెండు జెండాలు మరొక కొత్త జెండాను ఎగుర వేసేటంతవరకు ఎగిరాయి. ఈ క్రొత్త జెండా తొలుత తొలుతగా వచ్చిన అతిధులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు దానివంక జాగ్రత్తగా పరిశీలించి చూచినమీదట తమ 'అతిథేయి' గ్రేట్ బ్రిటన్ అమెరికాల జెండాలను రెంటినీ కలిపి విశిష్టంగా రూపొదించుకున్న సమ్మెళిత పతాకమని వారర్ధం చేసుకున్నారు. ఆ పతాక బహుశ: ఉద్దేశించినది కాక పోయినా, ఒక నాటికి గ్రేట్ బ్రిటన్, అమెరికాలు రెండూ కలిసి ఒక గణతంత్ర రాజ్యం లాగా సమ్మేళనాన్ని పొందబోతున్న వన్న ఉద్దేశాన్ని వ్యక్తీకరిస్తున్నట్లుండేది.

కార్నెగీ వనజంతువులను చంపటం సహించలేడు. జింకలు, కుందేళ్లు, అడవి కోళ్లు అతని ఎస్టేటులో అసంఖ్యాకంగా వున్నవి. అయితే అతడు వాటిని ఎన్నడూ వేటాడ లేదు. అతడు అతని అతిధులు చేతలను పట్టడానికి వెళ్లుతుండేవాళ్లు "వెళ్ళండి, మీకు ప్రియమైనదైతే వేటకు వెళ్ళండి. కానీ చంపవలసి వస్తే తప్ప చంపవద్దు దాన్ని గురించి నాకు ఏమీ తెలియనివ్వవద్దు" అని అతిథులతో