పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విక్టోరియా యుగపు తొలిరోజులనాటి నాలుగు గుర్రాల బండి ఒకటి క్రొత్త వార్నీసు మెరపుతో నీటుగా నిలచి అతిథులకు స్వాగత మిస్తుండేది. ఎర్రకోటు వేసుకొన్నబోదకు డొకడు దాన్ని నడుపుతుండేవాడు. ఇతని లాగానే ఎర్రకోటు తొడిగి బండి వెనక ఎత్తయిన ఆసనంమీద కూర్చొని 'కాలరొ' (Footman) ఒకడు 'శృంగా'న్ని (HORN) ఊదుతుండేవాడు.

స్కిబోయిలర్డ్ అనిపించుకున్న కార్నెగీ వంశవృక్షాన్ని వంశ లాంఛనాలను అసహ్యించుకున్నాడు. కాని స్కాబ్ దేశీయులు ధరించే దుస్తులకు కొద్ది మార్పులు జేసి 'కార్నెగీ ప్లయిడ్‌' అన్న ఉడుపును రూపొందించుకొన్నాడు. చిన్ని మార్గరెట్ ఇంట్లో తిరుగుతున్నప్పుడు, తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు, కొండ లెక్కుతున్నప్పుడు స్కాట్లండు లోని పర్వత ప్రాంతీయులు ధరించే రంగురంగుల తార్తాను ధరిస్తుండేది. కార్నెగీ స్కిబో వుండేటప్పుడు ఈ కుచ్చిళ్ళ దుస్తును తానే ధరిస్తుండేవాడు. ఆ ఎస్టేటులో పనిచేస్తున్న సేవకులు, శ్రామికులుకూడా దీన్నే ధరిస్తుండేవారు. స్కిబో పరిసరాలల్లో ఈ గుడ్డను కుటీరాలల్లోని మగ్గాలమీద చేత్తో నేస్తుండేవారు. అక్కడ అక్కడ స్కాబ్ తనానకి విశేష ప్రాముఖ్య మివ్వబడింది. స్కాచ్ గృహపాలకుడు, స్కాచ్ ఉగ్రాణోద్యోగి (Butler), ఒకరో ఇద్దరో స్కాబ్ ఉప సేవకులు. పైపరుకూడా వీరివలె స్కాబ్. ఇతడు ఉదయవేళ మేల్కొల్పుతూ, భోజన సమయాలల్లో తన జంత్రంమీద పార్వ తేయ గీతాలను అటూ ఇటూ తిరుగుతూ వినిపిస్తుండే