పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలహంలో ఉభయపక్షాలల్లో చాలామంది వ్యక్తులు గాయపడ్డారు, కొందరు మరణించారు. చివరకు క్రొత్తగా ఎత్తి వచ్చినవాళ్ళను దెబ్బకొట్టి తరిమివేయటం జరిగింది.

ఉభయవర్గాలవారు తాము చేసిన దానికి తల్లడ పడ్డారు. సంధిచేసుకోటం సముచిత మనిపించింది. ఈ విషయము రెండు రోజులు గడచిన తరువాత గాని స్కాట్లండులో వున్న కార్నెగీకి తెలియ లేదు. అప్పుడు అతడు తనకు లభ్యమయిన మొదటి నౌకమీద బయలు దేరి వస్తున్నానని నిస్తంత్రీ వార్త (కేబిల్) పంపించాడు. ఫ్రిక్, ఫిప్స్‌లు ఇద్దరూ కంపెనీ క్షేమం కోసం ఈ తడవ అక్కడే అమెరికాకు దూరంగా ఉండవలసిందనికోరుతూ సమాధానం పంపించారు. ఇందుకు కారణమేమిటో ఊహింపలేక పోయినప్పటికీ కార్నెగీ వారి అభ్యర్థనను మన్నించి అక్కడే వుండిపోయినాడు. "మమ్మల్ని ఏమి చెయ్యమని మీరు కోరుతారో తెలియ జెయ్యండి. మీకోసం మే మా పనిని చేసి తీరుతాం" అని కలహం అయిపోయిన తరువాత కార్మికుల యూనియన్ ఉద్యోగులు యిచ్చిన నిస్తంత్రీ వార్తవల్ల విషయం తెలుసుకొని కార్నెగీ ఎంతో చలించిపోయాడు. ఏం ప్రయోజనం. కాలం గడిచిపోయింది. నష్టం జరిగిపోయింది. తరువాత పన్నెడు సంవత్సరాలకు తాను కార్నెగీని అక్కడ ఉండిపొమ్మని అడగటానికి కారణం "వారు కోరేవి యెంత అనుచితంగా వున్నా ఆయన ఎల్లప్పుడూ శ్రామికుల కోర్కెలనే అభిమానించి తీర్చే మన:ప్రవృత్తితో వుంటాడు గనుక, వాళ్లు వాళ్ళ యిష్ట ప్రకారంగా వ్యవహా