పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అయిన మూడువేలమంది కార్మికులకు సంబంధించిందే అయినప్పటికీ, 1892 వేసగిలో హోమ్ స్టెడ్ కర్మాగారంలో సమ్మె వచ్చింది. కార్నెగీ స్కాట్లండులో ఉన్నాడు. ఈ అవకాశంవల్ల చేకూరిన ఉత్సాహంతో సమ్మెను బ్రద్దలు కొట్టేవాళ్ళకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సాహించటానికి ఫ్రిక్, సూపరింటెండెంటు ఇద్దరూ నిర్ణయించారు. ఇది వాళ్ళ అధ్యక్షుడయిన ఆండ్రూ కార్నెగీకి హృదయ ప్రియాలయిన సిద్ధాంతాలల్లో ఒకదానికి పూర్తిగా వ్యతిక్రమము. ఈ విషయం అతడు పూర్వమే లిఖితరూపంగా వెల్లడిచేశాడు. "ఎవరయినా పనిచేసేవాళ్లు పనిమానివేస్తే మాననివ్వటమే కంపెనీ కృతనిశ్చయమని వారికి తెలియజేయాలని నాఊహ. అట్టివారితో స్వేచ్ఛనిచ్చి సంప్రదింపులు సాగించాలి. వాళ్లు తిరిగి పనిలోకి వెళ్లుదామని నిశ్చయించుకొనేదాకా ఓపిక పట్టి ఆగాలి కానీ కొత్త వాళ్ళను పెట్టుకోటం ఎన్నడూ పనికిరాదు, పనికిరాదు."

ఫ్రిక్స్ ఉద్దేశాన్ని గురించిన కిం వదంతులు విని సమ్మెచేసిన శ్రామికులు సాయుధులై కర్మాగారానికి ప్రక్కవీథుల్లో పికెటింగ్ చేశారు. సమ్మెను బ్రద్దలు కొట్టేవారు కర్మాగారంలో ప్రవేశించేటప్పుడు వారికి రక్షణను ఇచ్చేటందుకు కౌంటీషరీఫ్ ఒక పెద్ద డిటెక్టివ్ ఏజన్సీని ఏర్పాటు చేశాడు. సమ్మె చేసినవాళ్ళు వీధులను అడ్డివేయటం వల్ల జూలై 1 న రక్షణ యిచ్చి క్రొత్తపనివాళ్ళను పడవలమీద తీసుకవచ్చి మిల్లులోపలికి మోనోంగ్ హెలా నదిమీదుగా వెనకభాగంనుంచి ప్రవేశపెట్టటం జరిగింది. అప్పుడు కలిగిన