పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నన్నింటినీ జాగ్రత్తగా ఓపికతో వినేవాడు. ఎక్కడయినా కలతలు, అన్యాయాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దేవాడు. అయితే కార్నెగీ సంస్థలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు కొత్తవ్యక్తులు, కొత్త ప్రభావాలు పరిపాలక వర్గాలల్లోను శ్రామికుల్లోనూ ప్రవేశించాయి. కార్నెగీ దీర్ఘ కాలం స్కాట్లండులో ఉండి పోతుండడం వల్ల కలత లారంభమై పెరగటం ప్రారంభిస్తున్నవి. ఇప్పుడు విలేక దాక్షిణ్యాలను జోడించి తన ప్రభావాన్ని పాలకవర్గ శ్రామికవర్గాల రెంటిమీద నెరపశక్తిగల టామ్ కార్నెగీ, బిల్ జోస్స్‌లు ఇరువురూ లేకపోవటం బాగా అనుభవానికి వస్తున్నది. బోర్డు ఆఫ్ మేనేజర్లకు అధ్యక్షుడయిన ఫ్రిక్ కఠినుడు. కరుణారహితుడు అని రూఢిగా నిరూపితమైంది. హెన్రీ ఫిప్స్‌కు వయసు పెరుగుతున్న కొద్దీ అతడు ఫ్రిక్ అభిప్రాయాల వంకకు మొగ్గుచూపటం ఆరంభించాడు.

హోమ్‌స్టెడ్ కర్మాగారంలోని హిటర్లు, రోలర్లుఅన్న చిన్న శ్రామికవర్గం వారు ప్రస్తుతం ఇబ్బంది కల్పిస్తున్నారు. ఉన్నత వర్గంనుంచి వచ్చిన క్రొత్త సూపరింటెండెంటు అసంతృప్తితో అల్లరిచేస్తున్న వీళ్ళతో వ్యవహరించే విషయంలో ఎక్కువ వివేకాన్ని ప్రదర్శింపలేకపోయాడు. ఈతని చెడ్డభావాలే ఇతరులలో కూడా ప్రవేశించి వ్యాప్తిపొందటం ప్రారంభించాయి. బ్రాడ్డాక్ వర్క్స్‌ను సక్రమంగా పాలించటం వల్ల సంస్థలో చాలా ఉన్నత స్థాయికి చేరుకొన్న ఛార్లెస్ స్క్వాబ్ హోమ్‌స్టెడ్‌లో ఆచిన్ని శ్రామికవర్గంలో దౌత్యాలు నడిపించే స్థితిలో లేడు. అందువల్ల అల్పసంఖ్య