పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాటిని అమ్మివేసేయి." ఫిప్స్ దానిని అంతశ్రద్ధగా కాకుండా ఎదోగా 'సరే' అన్నాడు. "అయితే అంత తొందర లేదు. ఎప్పుడయినా చెయ్యవచ్చు" నన్నాడు.

"అలాకాదు హారి. వెంటనే జరగాలి! నా మాటను మన్నించు" అన్నాడు యజమాని. ఆ బ్యాంకు కొద్ది నెలలు కాగానే పెద్దమొత్తం లొంగుడు పడి దివాలా తీసింది. అప్పుడు అతడు షేర్లను అమ్మివేయటం మంచిదైందని సంతోషించాడు. 1888 లో మిల్లులు, కొరములు రోజు ఒకటికి రెండువేల టన్నుల ఉక్కు, ఇనుమును ఉత్పత్తి చేస్తున్నవి. 'కొన్నిలిస్ విల్లీ'లోని నలభై రెండు వేల ఎకరాల అందమైన కోహింక్ కోల్ గనుల ప్రాంతానికి మీద ఫ్రిక్ కోక్ కంపెనీ యాజమాన్యం వహిస్తున్నది. తన బాల్యం నాటి మిత్రుడయిన హారీ ఆలివర్ ద్వారా మిన్నె సోటాలో కొత్తగా కనుక్కోబడ్డ మిస్సబీ ఇనుప ఖనిజపుభూమిని ఎన్నో ఎకరాలు కార్నెగీ గుత్తకు తీసుకొన్నాడు. వందలకొద్ది చిన్న ఉక్కు వస్తువులను తయారుచేసే మరొక కర్మాగారాన్ని స్థాపించటం జరిగింది. దాని ద్వారా వారి ఆజాతి వ్యాపారం కూడా వృద్ధిపొందింది. ఇదైనా 'ఎ. సి.' కి తమ మార్గానికి కొంత దూరమైందిగానే కనిపించింది.

కార్నెగీకి కార్మికులవల్ల ఎన్నడూ ఎటువంటి తీవ్రమైన ఇబ్బందీ కలుగ లేదు. బహుసంఘ్యాకులైన కార్మికులతో అతడు సూటిగా సంబంధం పెట్టుకొనేవాడు. వాళ్ళ నాయకులందరినీ సాన్నిహిత్యసూచకంగా వాళ్ళ మొదటి పేర్లతో పిలుస్తుండేవాడు. వాళ్లు వినిపించవచ్చిన కష్టాల