పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యక్షుడు అలాగే చేశాడు. ఒక సుప్రసిద్ధు డయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించటం ఈ రీతిగా జరిగింది. మధ్య కాలంలో బీలీ తగాదా సద్దుమణిగింది. సౌమనస్యం వల్ల అది పరిష్కారమైంది. అంతర్జాతీయ శాంతికి తానుగూడా కొంత తోడ్పడ్డానన్న తృప్తి కార్నెగీకి కలిగింది. ఇలా అతని వాషింగ్టన్ ప్రయాణం ఎంతో ప్రయోజనకారి అయింది.