పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిలా చెప్పిన మీరు విభిన్న మార్గాన్ని స్వీకరించి వ్యవహరించటం చూసి నేను ఆశ్చర్యపడటమే కాదు యెంతో చింతిస్తున్నాను."

"అయితే ఇది తగాదా. కేవలం అభిప్రాయభేదం కాదు." అని అధ్యక్షుడు అభ్యంతరం చెప్పాడు. "మన పౌరులను వాళ్లు కావాలని చంపారు. గాయపరిచారు, విదేశాలలోని మన పౌరులకు రక్షణ కల్పించే విషయంలోమనకు యెంతో ప్రఖ్యాతి వుంది"

"ఆ మాటకు వస్తే ఆనావికుల్లో చాలామంది అమెరికన్లు కాదు. విదేశీయులు. ఒక చిన్న వీధి కలహాన్ని ఆధారం చేసుకొని చిలీవంటి చిన్న దేశంమీద కఠినచర్య తీసుకుందామని మీరు ఆలోచిస్తున్నట్లు విన్నందుకు నేను యెంతో చింతిస్తున్నాను"

న్యూయార్క్ పురవాసులు వ్యాపారం, డాలర్లను గురించి తప్ప మరొక విషయాన్ని దేన్నిగురించీ ఆలోచించరని అన్నాడు అధ్యక్షుడు లౌభ్యంతో. "ఇదే న్యూయార్క్ వారి రీతి. గణతంత్ర రాజ్యగౌరవంకంటే వారు తమ ధనపు సంచీలను గురించి ముందు ఆలోచిస్తారు"

"మిస్టర్ ప్రసిడెంట్ యుద్ధంవస్తే విశేష లాభాలను పొందే యునై టెడ్ స్టేట్సు వాళ్ళల్లో నే నొకణ్ని. ఉక్కును వుత్పత్తి చేసేవాళ్ళలోకల్లా పెద్ద వాణ్ణి కావటంవల్ల యుద్ధం నా జేబుల్లో కోట్లు క్రుమ్మరిస్తుంది" అని కార్నెగీ నెమ్మదిగా మనసు కెక్కేటట్లు మాట్లాడాడు.