పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ భవనాన్ని తిరిగి తెరచి నపుడు అల్తూనాలోని చిన్న పిల్లలు పెన్నీలు పెన్నీలుగా ఇచ్చిన ద్రవ్యంతో తయారు చేయించిన చిన్న పాలరాతి కార్నెగీ విగ్రహం, ఊర్ధ్వకాయం (Dust) కృపాళువయిన ఆ దాత జ్ఞాపక చిహ్నంగా ప్రవేశద్వారానికి వెనక ప్రక్కన ఉంచ బడింది.

అతడు న్యూయార్క్‌లోని ఇంజనీరింగ్ సంస్థలకు, ప్రతి ఒక్క స్థలం ప్రత్యేక నివేశనాన్ని ఏర్పాటుచేసుకోటానికి, గ్రంథాలయము, ఆడిటోరియం ఏర్పాట్లతోసహా, కేంద్ర మన్హట్టన్‌లో పదునైదంతస్తుల క్లబ్బ్‌ను నిర్మించే ఉద్దేశములో 1,00,000 డాలర్లు దానమిచ్చాడు.

ఎల్లవేళలా సంగీతమంటే అతనికి ఎంతో ప్రీతి కనుక సంపాదించుకో లేక కష్టపడుతున్న చర్చీలకు 'పైపు' వాద్యాలను ఇవ్వటం ప్రారంభించాడు. అతని దానాలల్లో కల్ల కోట్లజనాలకు సంతోషాన్ని కలిగించింది న్యూయార్క్ యాభైయేడవ వీథిలో ఏడవ ఎవెన్యూలో అతడు కట్టించిన సంగీత సౌధం. కొన్ని సంవత్సరాలవరకు సంగీత ప్రపంచంలో ప్రముఖులైనవారి సంగీతం అందులో వినిపించింది. దాత దానికి న్యూయార్క్ మ్యూజిక్ హాల్ అని పేరు పెట్టాడు. కానీ చిరకాలం జనం దాన్ని "కార్నెగీ హాల్‌" అని వ్యవహరించటంవల్ల తరువాత ధర్మకర్తలు అదే పేరును దానికి నిర్ణయించారు. ప్రసిద్ధుడయిన రష్యన్ వాగ్గేయకారుడు పీటర్ ట్కైకోలి స్కీని అతడు 1891 లో, దాని ప్రారంభోత్సవ