పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దానశీల తాను ముందు భావించిన దానికంటె పరిశోధన, సంచరణ (Circulation) గుణాలకు అవకాశాన్నిచ్చే బృహద్గ్రంధాలయము, కళాఖండ నివేశనగృహం. (Art Gallery) ఆడిటోరియింలు అవసరమని గుర్తించాడు. నగరం పాలనకోసం 40,000 డాలర్లు వ్యయంచేస్తానని వాగ్దానం చేస్తే తాను పదిలక్షలడాలర్లు ఇస్తానన్నాడు. తరువాత త్వరలోనే దానికి మరో 1,00,000 [ లక్ష ] డాలర్లు చేర్చాడు. ఆర్టు గ్యాలరీకోసం ఒక పదిలక్షల డాలర్లు యిచ్చాడు. కార్నెగీ ఇన్‌స్టిట్యూట్ పెరిగిపోయింది. ఒక షాపు శతాబ్దిలో దాని దాత దానికోసం 2,80,00,000 [ రెండుకోట్ల ఎనభై లక్షలు ] డాలర్లు వ్యయం చేశాడు.

అతని దానాలు విస్తృతిలోను, సంఖ్యలోను క్రమంగా పెరిగిపోతున్నవి. కొంతకాలంగా అతడు క్రొత్త భవనాలలో నిర్మించుకోటానికి గ్రంథాలయాలను ఇతరమయిన అవకాశాలను చేర్చుకునేటందుకు కళాశాలలకు 10,000 మొదలు 1,00,000 డాలర్లవరకూ కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ మొత్తాలు ఇస్తూ వచ్చాడు. అతడు నగరంలో ఇదివరకే ఉన్న గ్రంథాలయాలను పెంపొందించుకొనేటందుకు డబ్బు ఇచ్చిన సందర్భా లెన్నో వున్నాయి. ఉదాహరణకు అట్లాంటాలో యంగ్ మెన్స్ లైబ్రరీ ఎసోసిఏషన్ ముప్పది సంవత్సరాలనుంచి ఒక ప్రజా గ్రంథాలయాన్ని నెలకొల్పి నడిపించటానికి ఎంతగానో తికమక పడుతున్నది. దాన్ని పెంపొందించి మంచిస్థితిలో నిలపటం కోసం కార్నెగీ వారికి 1,25,000 డాలర్లు ఇచ్చాడు. వారి కీ పనిని పూర్తి చేయ