పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లాగుకోబడ్డది గాని దాన మివ్వబడినది కాదు" అన్నాడతడు.

నగరం కనుక 15,000 డాలర్లు ప్రతిసంవత్సరం కేటాయించి దానితో సక్రమ నిర్వహణకు ఏర్పాటు చేయిస్తామంటే తాను ఒక ప్రజాగ్రంధాలయానికి 2,50,000 డాలర్లు ఇస్తానని కార్నెగీ పూర్వం 1881 లోనే పిట్స్‌బర్గు మేయరుకు ఒక లేఖ వ్రాశాడు. నగర ప్రముఖులు కొందరు ఈ సూచనకు వ్యతిరేకించటం చాలా వింతయిన విషయం. పిట్స్‌బర్గు టైమ్స్ పుస్తకాలు, మాగజిన్లు, వార్తా పత్రికలు పెద్దఖరీదు లయ్యేవి కావు కాబట్టి గ్రంథాలయం అనవసరమని ప్రజాపార్కు అవసరమని అందువల్ల కార్నెగీ దానికి ఇస్తే బాగుంటుం దీసంపాదకీయం వ్రాసింది. అంతేకాకుండా గ్రంథాలయంకోసం పన్నులువేసి డబ్బుచేకూర్చటానికి నగరానికి అధికారంకూడా లేదని అది సూచించింది. అందువల్ల శాసనసభ గ్రంథాలయాన్ని నెలకొల్పి దానిని పాలన చేయించే విషయంలో ఒక శాసనం చేసేటంత వరకూ ఈ విషయం ఆ రేళ్ళపాటు వెనకబడ్డది. అప్పటికి ఇంకా పిట్స్‌బర్గుతో చేరిపోని అలీఘను ఈ మధ్య కాలంలో కార్నెగీని అభ్యర్థించి కల్నల్ ఆన్డర్ సన్ మెమోరియల్‌తో బాటుగ దానినికూడ పొందింది. ఆ వుత్సవ సమయంలో ప్రసంగించటానికి ప్రెసిడెంటు బెంజిమిన్ హారిసస్ వాషింగ్టన్ నుండి వచ్చాడు.

పిట్స్‌బర్గు 1887 చివరిలో ఆ దానాన్ని పుచ్చుకోటానికి సంసిద్ధమైనప్పుడు కొలది సంవత్సరాలలోనే ఆ నగరం బాగా వృద్ధి పొందనున్న దన్న అంశాన్ని గమనించి దానికి ఆ