పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజసౌధం మధ్యయుగపు మరికొన్ని కట్టడాలు ఈనాడు శిథిలావస్థలో వున్నవి ఒకప్పుడు స్కాబ్ రాజ కుటుంబం నివసించినదీ, ఇంగ్లండు రాజు ఛార్లెస్ I జన్మించినదీ అయిన రాజసౌధానికి సంబంధించిన ఒక గోడమాత్రం నేటికీ పడిపోకుండా నిలిచి వుంది. గౌరవనీయుడైన బ్రూస్ గోరీతో సహా రాజుల గోరీలకు, రాణుల గోరీలకు నీడ నిస్తూ అందమైన నలు చదరపు బురుజులతో, ఎత్తయిన శిఖరంతో వున్న అందమైన గొథిల్ ఆబ్బీ ఇంకా నిలిచివుంది. డన్ఫ్‌ర్మ్‌లైన్ నుంచి ఆగ్నేయ దిక్కుగా ఫిర్త్ ఆఫ్ ఫోర్త్ లోయగుండా చూస్తే, మబ్బులు లేని రోజున, పదిహేను మైళ్ళ దూరాన పొగల మధ్య కనిపించే ఎడింబరోలోని పొగ గొట్టాలు, గండశిలమీద ఉన్న దాని ఎత్తయిన దుర్గం కనిపిస్తవి.

వివాహం వల్ల అంకుల్ అయిన జార్జి లాడర్ ఇష్టుడయిన బంధువు ఇతడు చరిత్ర, జనశ్రుతిని బోధించే ఉపాధ్యాయుడు. అంకుల్ లాడర్ ఒక షాపు వ్యాపారి. అతని భార్య కొన్ని యేండ్లకు పూర్వం చనిపోయింది. ఇతడు ఆండ్రూను, తల్లిలేని తన కుమారుడైన జార్జిని నగరంలోను నగరం చుట్టుప్రక్కలా వున్న చరిత్రాత్మక ప్రదేశాలకు తీసుకొనిపోయి చూపిస్తుండేవాడు. బయలుదేరబొయ్యేముందు వారు చూడనున్న ప్రదేశాలకు గురించి కొంత తెలుసుకోమనేవాడు. అందువల్ల అతడు దేన్ని గురించి ప్రసంగించబోతున్నాడో వాళ్లకు ముందే తెలిసివుండేది. ఉదాహరణకు అతడు వాళ్ళను నగరానికి కొన్ని మైళ్ల దూరాన వున్న