పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వివాహం ఐశ్వర్య సువార్త

10


కార్నెగీకి గుర్రపుస్వారీ అంటే చాలా యిష్టం. రకరకాల యువతులతో కలిసి అతడు కేంద్రారామంలో (Cen-tral Park) స్వారిచేశాడు. ఈయువతుల్లో లూయీవిట్ఫీల్డ్ ఒకతె. ఈమె న్యూయార్క్‌లో ఒక టోకు వ్యాపారస్థుని కుమార్తె. ఈమె అంటే ఆండ్రూకు ఎక్కువ మక్కువ. ఒకటి రెండు సంవత్సరాల సాహచర్యం కలిగిన తరువాత ఆమె అంటే తనకు ప్రేమ వున్నట్లు అతడు గ్రహించాడు. జీవితంలో ఈ ప్రేమభావమంటూ కలగటం అతని కిదే మొదటిసారి. ఆమెతో పూర్వానురాగ ప్రేమోదంతం ప్రశాంతంగా నడిచింది. చివరకు మిస్ విట్ఫీల్డు అతడు చేసిన వివాహ సూచనకు అంగీకరించింది. కొంతకాలం వారుఒడంబడిక సమయంగా గడిపారు.

ఈ మధ్య కాలంలో కార్నెగీ ప్రతి సంవత్సరం చేసే విదేశయాత్రల సందర్భాలలో గ్రేట్ బ్రిటనులోని అనేకులతో స్నేహసంబంధాలు, ఇతర సంబంధాలు ఏర్పరచుకొ