పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది అంత చులకనగా జరిగిపోయింది. తెలుసుకొంటున్న కొద్దీ అతడు చార్లీని మెచ్చుకోటం ప్రారంభించాడు. స్క్వాబ్ మంచి బుద్ధికుశలత కలవాడు. పనివిషయంలో అలుపంటూ ఎరగడు. శ్రద్ధ వివేషం, జీవించి వున్న వారిలోకల్లా మనోహరమయిన వ్యక్తి. వెంటనే అతడు వుక్కును నిర్మించటాన్ని గురించిన రసాయనిక శాస్త్రగ్రంథాలు చదవటం ప్రారంభించాడు. కెప్టన్ బిల్ అన్నట్లు అనతికాలంలోనే అతడు ఆ కర్మాగారాన్ని గురించిన అన్ని విషయాలు తెలుసుకొన్నాడు. ఇతని వంటి వ్యక్తులే కార్నెగీకి ప్రీతిపాత్రులు కాగల అర్హతగలవాళ్లు. తొలి సమావేశమయిన క్షణంనుంచీ అతడు ఆ వుక్కు రాజు 'బాలు'లో ఒకడయినాడు. తుదకు వారందరికంటే అతడికి అతి సన్నిహితుడయినాడు. జోన్సు అతనికి వుద్యోగ మిచ్చిన తరువాత ఆరునెలలలోనే స్క్వాబ్ భ్రాడ్డాక్‌లో అసిస్టెంటు మేనేజరయినాడు. అతడు కేవలం స్వశక్తివల్ల ఆస్థానాన్ని సంపాదించుకున్నాడు. తరువాత ఐదు సంవత్సరాలకు కెప్టెన్ జోన్సు కర్మాగారంలో కలిగిన ఒక హఠాత్సంభవంవల్ల మరణించినప్పుడు చార్లీ హోమ్‌స్టెడ్ కర్మాగారానికి సూపరింటెండెంటు అయినాడు. అతని పర్యవేక్షణక్రింద ఉత్పత్తి ప్రశంసనీయంగా పెంపొందింది.

కార్నెగీ తరువాత ఒక కాంగ్రెషనల్ కమిటీలో ప్రసంగిస్తూ "మిష్టర్ స్క్వాబ్ ఒక మేధావి. అతనితో సమానమయినవాణ్ని నే నెన్నడూ కలుసుకోలేదు!" అన్నాడు.

అనేక సంవత్సరాలల్లో అనేకమంది యువకులకు భాగ