పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మంచిది. చార్లీ అక్కడ మన స్థితి ఎలావుందో చెప్పు. నాకు చాలు." అన్నా డా వ్యాపార ప్రముఖుడు. విపులమయిన నివేధనను వినటానికి అతడు కుర్చీలో వెనక్కు వ్రాలాడు. నివేదన అతనికి ఆశ్చర్యాన్ని కలిగించేటంత విపులంగా వచ్చింది. ఈ యువకుడు నిశ్చయంగా కర్మాగారాన్ని గురించి అంతా తెలిసినవాడు. కార్నెగీ ఎన్నో ప్రశ్నలను కురిపించాడు. అతడు వెంటనే అన్నిటికీ పూర్తిగా సమాధానం చెప్పాడు. ఈ మధ్యకాలంలో కార్నెగీ అతని ముఖం ఎక్కడో కొంత పరిచితమయినట్లు తోచింది.

"మనం పూర్వం ఎప్పుడయినా కలుసుకొన్నామా?" ఇది తరువాతి ప్రశ్న.

"ఔను, క్రెస్సన్‌లో మీ గుర్రాన్ని పట్టుకుంటుండే వాణ్ని."

అక్కడే, ఆ క్షణాన క్రొత్త భాగస్వామి ఇంకొకడు ఏర్పడ్డాడు.

ఉక్కు వ్యామోహం ఆకర్షించటంవల్ల స్క్వాబ్ పద్ధెనిమి దేళ్ళ వయస్సులో బ్రాడ్డాక్ వరకు వచ్చి, అక్కడ ఒక చిల్లరకొట్టులో వుద్యోగానికి కుదిరాడు. అప్పుడు అతడు కెప్టెన్ జోన్సుకు నిత్యం చుట్టలు సప్లయి చేస్తుండేవాడు. "కెప్టన్ జోన్సు, మిల్లులో నా కేదైనా వుద్యోగ మివ్వగలవా?" అని ఒకరో జాయనను డడిగాడు.

అప్పటికే జోన్స్‌కు ఆ యువకుడిమీద ప్రీతి ఏర్పడి వుంది. "యేమిటి? చార్లీ తప్పక యిస్తా" నన్నాడు.