పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతనికి తలనొప్పి. తని వేసగి యాత్రలను గురించి చెపుతూ, ఒకమాటు కార్నెగీ అతనితో "నేను ఎంత అలసిపోయినా స్టీమ రెక్కిన తరువాత అర్ధగంట గడిచి నూజర్సీ ఉన్నత భూములు నా వెనుక క్షితిజరేఖలోకి దిగజారినవంటే నా బాధ్యతలు, అలసట నన్ను విడిచి జారుకుంటాయి. బిల్, అది ఎంత ఉపశమనమో నీకు తెలియదు" అన్నాడు.

"అది మిగిలిన మా అందరికీ ఎంత ఉపశమనమో నీకు తెలియదు" అని సరసత లేని ఆ కెప్టన్ జోన్స్ బదులు పలికాడు.

యజమాని కార్యాలయానికి రిపోర్టులను తీసుకొని రావలసిన ఒక రోజున బదులుగా ఆరడుగుల ఎత్తు సరివాడు, తేజో వంతుడు అయిన ఒక యువకుడు హాజరై కెప్టెన్ పంపితే వచ్చానన్నాడు. అతడు సంక్షిప్తరూపంలో వున్న రిపోర్టును అందిస్తే తల యెత్తబోయేముందు కార్నెగీ కొద్ది క్షణాలునిశ్శబ్దంగా పరిశీలించాడు.

"కర్మాగారాన్ని గురించి నీ కంతా తెలుసునని కెప్టన్ అంటున్నాడు" అన్నాడు కార్నెగీ.

"ఔను. దాన్ని గురించి నాకు బాగా తెలుసును"అని ఆ యువకుడు సమాధానం చెప్పాడు. అందమయిన చిరునవ్వు యధాప్రకారంగానే ఆతని ముఖాని కందా న్నిచ్చింది.

"నీ పేరేమి" అంటూనే మహావ్యాపారి కెప్టెన్ వ్రాసిన చీటికి క్రింద భాగాన్ని చూస్తున్నాడు.

"ఛార్లెస్ యం. స్క్వాబ్."