పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాలా పెద్ద మొత్తం మీరు జీతంగా నా కివ్వవచ్చు అని అతడు సమాధాన మిచ్చాడు.

"మంచిది. ఆ పని చెయ్యి" అని బల్లగుద్దాడు యజమాని.

"ఇప్పటినుంచి నువ్వు అమెరికా అధ్యక్షు డెంత జీతం తీసుకుంటాడో అంత తీసుకో. అది సంవత్సరానికి యాభై వేల డాలర్లు."

"అది కేవలం చెప్పుకోటం మాత్రమే ఆండీ అన్నమాటే బిల్ ఇచ్చిన అంగీకారం.

సౌమ్య స్వభావుడయినా ఎళ్ళ వేళలా కార్నెగీ పొడిచి పని చేయిస్తుంటాడు, అభివృద్ధులను గురించి, ఇతర విషయాలను గురించి రిపోర్టులు అడుగుతుంటాడు. "ఉక్కును ఉత్పత్తి చేయటంలో గడచినవారం మనంపూర్వపులెక్కలను అన్నింటినీ అధిగమించాయి" అని తెలియ జేస్తే అతడు సమాధానమిస్తూ "శుభా కాంక్షలు. ప్రతి వారం మన మిలా ఎందుకు చెయ్య గూడదు" అని అడగడమో లేక విలువల పట్టికలను [Cost Sheets] పంపమనటమూ చేసేవాడు. "8 వ నెంబరుకొలిమి ఈ రోజున పూర్వపు రికార్డు నంతటినీ మించింది" అని తెలియజేస్తే "వెంటనే మిగిలినవి ఏంచేస్తున్న"వని ప్రశ్నించేవాడు. బిల్‌జోన్స్ ఈ సోదిపోట్లతో కొన్ని సమయాలల్లో నలిగిపోతుండేవాడు. విపులమయిన రిపోర్టులు, మూల్యపట్టికలుతయారు చెయ్యటమంటే అతనికి అసహ్యం. అతడు గొప్ప ఉక్కు నిర్మాత; కానీ గణనాంక (Statiscics) మంటే