పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వహించే ఆమె పుత్రుడు "ఆన్ అమెరికన్ పోర్-ఇన్-హాండ్ యిన్ బ్రిటన్" అన్న గ్రంథంలో ఈ కోచ్ ప్రయాణాన్ని వర్ణించాడు. ఈ గ్రంథం 1882 లో ప్రకటితమైంది.

ఆ 1881 సంవత్సరంలోనే పిట్స్‌బర్గు పెట్టుబడిదారులు బ్రతిద్వద్వంగా హోమ్‌స్టెడ్‌లో ఎడ్గర్ థామ్సన్ వర్క్స్‌కు కొంచెం క్రిందుగా మోనాంగహాలా నది ఆవలి ఒడ్డున మరొక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు. కానీ కొత్త సంస్థకు కార్మిక సంబంధమైన ఇబ్బందులవల్ల దెబ్బతగిలింది. కొంత వెనక్కు తగ్గి వచ్చిన ఆర్డర్లను తగ్గించుకోవలసివచ్చింది. దానిమీదట డైరెక్ట్ర్లు వాళ్ళల్లో వాళ్ళు తగాదాలు పడ్డారు. చివరకు అందరూ వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నారు. ఒక మధ్యవర్తి వచ్చి కార్నెగీని కలుసుకున్నాడు. ఈ పరిణామాలను మొదటినుంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్న కార్నెగీ ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహిస్తూనే వున్నాడు. ఆ మధ్యవర్తి అతన్ని హోమ్‌స్టెడ్ ను పుచ్చుకుంటారా అని అడిగాడు. అతడు తీసుకుంటానన్నాడు. తరువాత ఒక ప్రతినిథి సంఘం ఆతడిక్కడ తమను స్కాచ్ సంప్రదాయను గుణంగా పిండివేస్తాడో అన్న భయంతో అతని కార్యాలయానికి వచ్చారు.

"మీ షరతులే" మని వారు ప్రశ్నించారు.

"కార్నెగీ కార్పొ రేషన్‌లోని స్టాకుమూలంగా గాని విడిగా డబ్బురూపంలో గాని మీ రెలా కోరితే అలా ఆ కర్మాగారంలో మీరు పెట్టిన ప్రతిడాలరు మీకూ తిరిగి ఇచ్చివేస్తాం."