పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దగ్గిర రెండుచోట్ల ఆగింది. రెండోచోట ఆగినప్పుడు ఏర్పడ్డ నిశ్శబ్దంలో వినిపించిన అబ్బీ గంటల తీయనైన ధ్వనులకు "ఉక్కు-రాజు" కన్నులలో ఆనందభాష్పాలు పొంగిపొర్లాయి.

తరువాత విందు జరిగింది ... పరిచికాలైన పూర్వ ప్రదేశాలను, ఇతర ముఖ్యస్థలాలను తిరిగి చూశారు. శంకుస్థాపనోత్సవ సమయంలో ఏరిల్ ఆఫ్ రోస్బరీ ప్రసంగించాడు. ధర్మకర్త లందరూ ఆ వుత్సవపు తంతును కార్నెగీ తానే నిర్వహిస్తున్నాడని వుద్దేశపడ్డారు. కానీ, అతడు ఆ గౌరవాన్ని తన తల్లి కివ్వ వలసిందని ప్రార్థించాడు. సంవత్సరం సంవత్సరం ఆమె మీద అతని గౌరవం వృద్ధికావడమే యిందుకు కారణం. అతడు అప్పు డప్పుడు ఆమె నొసటిని వ్రేలితో తాకి 'టామ్‌కు, నాకు మేధాశక్తి నిచ్చిన తావు యిక్కడే వుంది" అనేవాడు. అతడు తలచినట్లె శితకేశ కిరీటంతో వినీలమైన సిల్కు వస్త్రాలలో విశిష్టమైన మూర్తిని వహించిన ఆతని తల్లి, అమలినమయిన ఆత్మశక్తిని అత్యుదాత్తతను ప్రకటిస్తూ తంతు నంతటినీ పూర్తిచేసింది. సున్నాన్ని వెండి తాపీతో పరచి, ఎత్తిన రాతిమీద ముమ్మారు మూడు దెబ్బలుకొట్టి అక్కడ సమావేశమయిన వారందరికీ వినిపించేటట్లు స్పష్టమయిన కంఠంతో "స్మృతి చిహ్నమయిన ఈశిల సశాస్త్రీయంగాను, సక్రమంగాను నిక్షిప్త మయినదని నేను ప్రకటిస్తున్నాను," పరమేశ్వరు డీ ప్రయత్నాన్ని ఆశీర్వదించుగాక!" అన్నది.

తా నొక రచయిత ననే భావాన్ని ఎల్లప్పుడూ