పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఏమిటి? నా జ్ఞాతి బాబ్!"

"అవును."

"నీవు ఇక్కడికి రావటం ఎలా జరిగింది?"

"ఇక్కడికి వస్తే మేము బాగుపడగలమని భావించాను."

'మేము' అన్న మాటను తిరిగి ఉచ్చరించి" "ఇంకా నీతో ఉన్నావా ళ్ళెవరు?" అని కార్నెగీ ప్రశ్నించాడు.

"నా భార్య."

యజమాని అతణ్ని చిత్రంగా పరికించి చూచాడు. "నేను నీకు బంధువును గదా. మొదట నాదగ్గిర కెందుకు రాలేదు?" అని ప్రశ్నించాడు.

"నీ కొక పరిచయ పత్రాన్ని వ్రాసియిచ్చి వుండేవాణ్ని. ఇంతకంటే మంచి పనిలో చేరే అవకాశం కల్పించి ఉండేవాణ్ని" అన్నాడు.

ఆ యువకుడు "అవకాశం లభించింది గదా అన్యసహాయం ఎందుకులే! అనుకున్నా"నని సూటిగా ఆ పెద్దమనిషి కళ్ళల్లోకి చూస్తూ సమాధాన మిచ్చాడు. ఈ ఉదంతాన్ని వర్ణిస్తూ "ఔను. అదే నిజమైన మారిసస్ స్వభావం అని ఉల్లాసంతో కార్నెగీ పెద్ద పెట్టున అన్నాడు. "స్వశక్తిమీదనే ఆధారపడటం లూసిఫర్ లాగా స్వతంత్రుడుగా ఉండటం నేర్చుకొన్నా" డన్నాడు.

శక్తిమంతుడైన జ్ఞాతి సహాయం లేకుండా నే థామస్ కొద్ది సంవత్సరాలకే డూక్యూస్నీలోని క్రొత్త కర్మాగారా