పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాయి. కంపెనీలోని భాగస్థులందరూ "మనం ఇతడ్ని తిరిగి ఇంటికి వెళ్ళనీయకూడదు" అని కూడబలుకు కొన్నారు. ఆ కారణం వల్ల లాడర్ అమెరికాలోనే నిలచిపోయినాడు. కార్నెగీ సంస్థలో భాగస్థుడయి చివరకు, మహాధనికుడుగా మరణించాడు.

ఉక్కు సైన్యంలో చేరటానికి డన్ఫ్‌ర్మ్‌లైన్ ఎంతోమందిని చేకూర్చి యిచ్చింది. "మిష్టర్ కార్నెగీ, మీ బంధువొకడు ఇక్కడ పనిచేస్తున్నాడు. మీకు తెలుసునా?" అని ఒకనాడు కర్మాగారంలో నడుస్తున్నప్పుడు సూపరింటెండెంటు కార్నెగీని హెచ్చరించాడు.

"తెలియదే!" అని అతడు ఆశ్చర్యంతో సమాధానమిచ్చాడు.

"పైగా అతడు సిద్దహస్తుడయిన మంచి యంత్రవేత్త కూడాను. అతడు మీకు జ్ఞాతి అని కొలదికాలం పూర్వం వరకూ నాకు కూడా తెలియదు."

"అతడితో నేను మాట్లాడవచ్చునా?"

"తప్పక" అని సూపరింటెండెంటు కార్నెగీని ఒక యంత్రం సరిచేస్తున్న యువకు డొకడి దగ్గిరికి తీసుకు వెళ్ళాడు. "ఇదిగో ఇతడే" అని అతడు "టామ్ ! వీరు మిషటర్ కార్నెగీ అని పరిచయం చేశాడు.

"నీ పే రేమిటి?' అని యజమాని ప్రశ్నించాడు.

"థామస్ మారిసన్. మా తండ్రి రాబర్టు" అని యువకుడు సమాధాన మిచ్చాడు.