పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్తిని వృద్ధిపొందించుకోటం కోసం. మీ రిచ్చిన అప్పులకు తప్ప నేను ఈ కంపెనీతో సహ బాధ్యత వహించిన ఋణ పత్రాలు ఏమీ లేవు. నా సంస్థలనుంచి నాకు తిరిగి వచ్చే ప్రతి డాలరును, మీ బాకీలను తీర్చటానికి నా ఆస్తులు చాలునని చూపించటానికి హామీ ఇవ్వటానికి నేను సంసిద్ధుడనై వున్నాను.

"కార్నెగీ! ఆ ఋణాలను గురించి మాకు అణుమాత్రమయినా ఆందోళన లేదు" అని బ్యాంకి అధ్యక్షుడు బయటపడ్డాడు. ఇదంతా టెక్సాస్ అండ్ పసిఫిక్ కంపెనీ గురించి, వాళ్ళ ఋణపత్రాలమీద నీవు అనుమతి సంతకాలు చేస్తున్నావని మేము విన్నాము" అన్నాడు.

అప్పుడు కార్నెగీ అన్నాడు. "సాహసిక వ్యాపారంతో జోక్యం పెట్టుకొన్న నన్ను, మీరు ఎన్నడూ చూడ లేదు. వాల్‌స్ట్రీట్‌లో నేను మీకి ఎప్పుడూ కనిపించను. ఇక రుణపత్రాలమీద హామీ సంతకం పెట్టటం విషయమంటారా-ఋణం పక్వమైనప్పుడు నేను తీర్చటానికి మార్గం స్పష్టంగా కనిపిస్తుంటేనేగాని లేదా చెల్లించ లేని స్థితి వస్తే దానికి తగినంత ఆస్తి నాకు వుంటేనేగాని ఏ రుణపత్రంమీదా సంతకం చెయ్యకూడదని నా దీక్ష. నా పాశ్చాత్య మిత్రుడొకడు అన్నట్లు నడవ లేనంతటి లోతున్న నీళ్ళల్లోకి నేను ఎన్నడూ వెళ్ళను."

ఆర్ధిక - వ్యాపారిక ప్రపంచంలో కొత్తగా లభ్యమయిన ప్రగాడ గౌరవంతో కార్నెగీ ఈ సమావేశంనుంచి బయటికి