పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంపెనీలకు ఆర్థిక నిలయమైన ఎక్‌స్చేంజి బ్యాంకి ఎంతగానో ఆందోళన పడ్డది. ఈ బ్యాంకి కార్నెగీ కంపెనీలకు సంబంధించిన పత్రాలను పెద్ద మొత్తాలకు తన దగ్గిర కుదువబెట్టుకున్నది. అందుచేత ఆ బ్యాంకి డైరెక్టర్లు వెంటనే కనిపించవలసిందని కార్నెగీని పిలిపించారు. తగ్గ సమాధానం చెప్పుకోటం కోసం అతడు అతివేగంగా న్యూయార్క్ నుంచి బయలుదేరాడు.

గంభీరమైన ముఖ కవళికలతో కూర్చున్న ఆ డైరెక్టర్ల ముందు హాజరై కార్నెగీ అతి ప్రశాంతంగా యిలా అన్నాడు.

టెక్సాస్ అండ్ పసిఫిక్ కంపెనీలోని రెందు వందల యాభై వేల డాలర్ల వాటాలకు నేను యజమానినైన మాట సత్యం. దీని నంతటినీ నేను స్వంత ధన మిచ్చి కొన్నాను. ఎక్కడా నేను వారి పత్రాలమీద సంతకాలు పెట్ట లేదు.

వారు దీన్ని నమ్మలేకపోయినారు.

"ఒక డాలరు విలువజేసే వారి సాహసిక వ్యాపారపత్రంమీద కూడా నా సంతకం లే"దని గట్టిగా నొక్కిచెప్పి కార్నెగీ వాళ్ళతో ఇంకా ఇలా అన్నాడు. "వ్యాపార ప్రపంచానికి సాహసిక వ్యాపారం (Speculation) వంటి ఘనమైన అబిశాసం మరొకటిలేదని నా అభిప్రాయం. స్కాట్ ఎక్ స్చేంజి ద్యూత గృహంకంటే ఇంచుక మంచిది లేదా దానితో తుల్యమైంది." ఈ అభిప్రాయమే అతనికి జీవితాంతము వరకూ నిశ్చలంగా వుంది. "మా సంస్థల సాధన సంప