పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేయిమైళ్ళు రైలు పట్టాలను వెయ్యవద్దనీ నీకు బోధించటానికి నేను ఎంతో యత్నించాను. అయినా, నా మాటలు నీవు విన్నావు కావు. తరువాత నేను యూరప్‌నుంచి తిరిగివచ్చిన వెనుక నాకోసం 2,50,000 డాలర్లు వాటాలు ప్రత్యేకంగా కేటాయించానని చెబితె ఏదో పూర్వమైత్రినిపురస్కరించుకొని సరేనని ఒప్పుకున్నాను. ఇప్పటికీ టి. అండ్. పి సంస్థ కాలక్రమేణ లాభసాటిగా పరిణమిస్తుందనే నా విశ్వాసం. అయినా, ఆ ఋణపత్ర మీద నేను సంతకం పెట్టలేను. అలా జేస్తే మిల్లులలోని నా పెట్టుబడులకు, నా భాగస్థుల భద్రతకు ప్రమాదాన్ని కల్పించడమౌతుంది. కనుక ఆ పని నేను జేయకూడదు" అన్నాడు.

నిస్సంశయంగా ఈ నిర్ణయాన్ని చేసినప్పటికీ కార్నెగీ ఎదుర్కొనవలసి వచ్చిన ఏ ఆర్థిక సమస్యకూడా ఆతనికి దీనివల్ల కలిగినంతటి వ్యధను కల్పించ లేదు. ఈ నిర్నయం జరిగిన తరువాత స్కాట్‌తో మైత్రి పూర్వంవలె సాగకపోవటమే ఇందుకు కారణం. ఆర్థికమాంద్య భయోత్పాతం దెబ్బతీస్తున్న ఆ సమయంలో కార్నెగీ ఆ రీతిగా వ్యవహరించటం న్యాయమే. టెక్సాస్ అండ్ పసిఫిక్ సంస్థలో స్కాట్‌తో కార్నెగీకి కూడా సంబంధం వున్న సంగతి అందరికీ విదితమైన విషయం. కార్నెగీ టెక్సాస్ అండ్ పసిఫిక్ సంస్థకు సంబంధించిన ఋణపత్రాలమీద సంత కాలు చేస్తే అతడు దాని వినాశం లోపలికి ఆకర్షింపబడినవా డౌతాడు. అందువల్ల పిట్స్‌బర్గులోని ఆతని సంస్థలన్నింటికీ ప్రమాద స్థితి కొని తెచ్చుకున్న వా డవుతాడు, అని ఊహించి కార్నెగీ