పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కార్నెగీ ఇప్పటికే ఒక రైలు మార్గానికి సంబంధించిన పెట్టుబడి విషయంలో చిక్కుబడ్డాడు. అది కొంతగా అతనికి వ్యధ కలిగించింది. అతని పూర్వమిత్రుడైన స్కాట్ చేసిన నిర్బంధంనల ఆతడు రూపొంధిస్తున్న టెక్సాస్ అండ్ పసిఫిక్ రైల్ రోడ్ సంస్థలో 2,50,000 డాలర్లు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఆ సంస్థ దివాలా తీసే పరిస్ధితిలో వుంది. పెద్ద మొత్తం దానికి అప్పు తేలింది. న్యూ ఇంగ్లండులో పుట్టిన జూనియస్ యస్. మోర్గన్ లండన్ లో బ్యాంకరుగా వున్నాడు. అతనికే ఈ సంస్థ అప్పు తీర్చాలి. కార్నెగీకి అతనితో ఎన్నోలావాదేవీలు ఉంటుండేవి. ఆతనికి టెక్సాస్ అండ్ పసిఫిక్ రోడ్ సంస్థ బాకీపడ్డ మొత్తం పెద్దది. అతడు కార్నెగీ కనక హామీ ఇచ్చి సంతకం చేసే టట్లయితే ఋణ పత్రాన్ని తిరిగి వ్రాయించుకొంటానన్నాడు. కానీ, కార్నెగీ అందుకు నిరాకరించాడు.

"ఆండీ! వాళ్ళకు అండగా వుండటానికి అంగీకరింపక నీ పూర్వ మిత్రులందరికీ వినాశనాన్ని తెచ్చిపెడతావా" అని స్కాట్ కార్నెగీని నిందించాడు.

దీనికి ప్రతిగా సమాధానమిస్తూ "సరే, ఈ వినాశం నీ బృందానికి గాని, నా వ్యాపారానికిగాని, నా భాగస్థులకుగాని, వారి కుటుంబాలకుగాని సంబంధించింది అయితే యీ సమస్య విషయంలో నేను అనుకూలమైన నిర్ణయము చేసి తీరవలసిందే. స్కాట్! మిక్కిలి తక్కువ మూలధనంలో రైల్‌రోడ్ నిర్మాణానికి దిగవద్దనీ, యత్కాలికంగా పుట్టిన అప్పులమీద ఆధారపడి