పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముంది. కీస్టోన్ వంతెనలకు, క్లోమన్ ఇరుసులకూ వచ్చినంత కీర్తిని మన ఇనుప పట్టాలకుకూడా సంపాదించగలమని నా అభిప్రాయ" మన్నాడు.

చివరకు థామ్సన్ తన పేరు పెట్టటానికి అంగీకరించాడు. 1873 లో ఆర్ధికమాంధ్య భయోత్పాతం దేశంమీద వచ్చి పడేనాటికి కర్మాగార నిర్మాణం అట్టె సాగ లేదు. అనేక మంది విమర్శకులు "ఆహా! పొంగులువారిన ఆండ్రూ కార్నెగీ అదృష్టం చివరకు అతనికే ఎదురుతిరిగింది. ఈ దెబ్బతో అతడు నాశనం కాక తప్పదు" అన్నారు. కార్నెగీ తన 2,50,000 డాలర్లు ధనాన్ని ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడు. ఇందులో అధికాంశం ఆతనికి బాండ్లు అమ్మకం వల్ల, కమీషన్ల వల్ల చేకూరిన ధనం. విధి విలాసంకొద్దీ తన దాన ధర్మ కార్యక్రమాన్ని ఆరంభించటంకోసం అతడు ఈ సంవత్సరాన్నే ఎన్నుకొన్నాడు. అతని స్వదేశంలోని డన్ఫ్‌ర్మ్‌లైన్‌లో ఒక ప్రజా స్నాన గృహదహనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ధనంకోసం పుల్మన్ సంస్థలోని పెట్టుబడులను, ఇతర రక్షణ నిధులను అమ్మివేశాడు. కర్మాగార నిర్మాణ పరిపూర్తికి మరికొంత ఆలస్యమైంది. కానీ ఎక్కువ కాలం గడవ లేదు. అప్పటినుంచి అతడు ఉక్కు ఇనుముల మీదనే దృష్టిని కేంద్రీకరించటంకోసం ఇతరత్రా తనకున్న వాటాలను అన్నింటినీ ఒకదాని తరువాత ఒకదాన్ని అమ్మివేశాడు అతడు. "నా మంచి గ్రుడ్లను అన్నింటినీ ఒక గంపలోకి చేర్చి ఆ గంపనే చూచుకొంటూ వుండటం వివేచనగల విధానమని నేను నిర్ణయం చేసుకొన్నాను" అన్నాడు.