పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపించిన అనుగ్రహాన్ని ఆండ్రూ ఎన్నడు మరచిపోలేదు.

కార్నెగీ క్రొత్తగా స్థాపించిన సంస్థలో అతని ఇనుము సంస్థలో ఉన్న భాగస్థులందరూ స్వల్పంగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రొత్త సంస్థకు సోదరుడు టామ్ స్థల నిర్దేశంచేశాడు. ఇది పిట్స్‌బర్గునుంచి మోనోన్గ్ హేలాకుపైన, పన్నెండుమైళ్ళదూరాన, బ్రాడ్డాక్ గ్రామందగ్గరవుంది, 177 లో ఫ్రెంచి - ఇండియన్ సైన్యం బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ బ్రాడ్డాక్ ను పరిపూర్ణ వినాశాన్ని పొందేటట్లు ఓడించి చంపివేసింది ఇక్కడే. ఈ ప్రదేశంలో వుండటంవల్ల ఉక్కు కర్మాగారానికి రెండు రైలుమార్గాలు, మోనోన్గ్ హెలా ద్వారా ఓహైయో నది అందుబాటులో వుంటవి.

కార్నెగీ దీనికి "రైల్‌రోడ్డు కాలంనాటి నా పూర్వమిత్రుని గౌరవార్ధం 'ఎడ్గర్ థామ్సన్ స్టీల్ వర్క్స్‌' అని పేరు పెడతా" నన్నాడు. థామ్సన్ సంస్థలో పెద్దమొత్తం పెట్టుబడిపెట్టాడు. అయినా అతడు ఈ అభిప్రాయానికి సుముఖత చూపించలేదు. "ఆండీ! అమెరికన్ ఉక్కు పట్టాలతో నాపేరుకు సంబంధం వుండటానికి నేను ఎంతవరకూ ఇష్టపడుతానో నాకు బోధపడటంలేదు. ఇంతవరకు తయారైనవి ఎవరికీ గౌరవ మిచ్చేటట్లు లేవు." అన్నా డతడు.

అందుకు అభ్యంతరం చెబుతూ కార్నెగీ "థామ్సన్! మనం మంచి పట్టాలను తయారుచేయబోతున్నాము. ప్రపంచంలోని ఇతర దేశాలల్లో ఉక్కును ఎంతబాగా తయారు చేయటానికి వీలుందో ఈ దేశంలో కూడా అంతగా అవకాశ