పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మందకొడి అయిన క్లోమన్ తన అభిప్రాయానికి అడ్డు చెబుతారు కార్నెగీ ముందే ఊహించాడు. కానీ తన ఇతర భాగస్థులు - తన సోదరుడు టామ్‌తో సహా - తన్ను కాదంటారని అతడు అనుకోలేదు. ఏమైనా వాళ్ళందరికీ ఇనుమంటే ఇష్టం. తమ అలవాట్లను, అభిప్రాయాలను అంత హఠాత్తుగా మార్చుకోలేరు. వాళ్ళు అప్పుడే ఒక క్రొత్త కొలిమిని నిర్మించారు. టామ్‌భార్య గౌరవార్ధంగా దీనికి 'ది లూసీ' అని పేరు పెట్టారు. దీని నిర్మాణానికి ఎంతో పెద్దమొత్తం వ్యయమైంది. ఎంతకూ భాగస్థుల్లో - ముఖ్యంగా టామ్‌లో, చలనం కలుగ లేదు. వాళ్ళందరూ ఎక్కువ తాపీ అయినవాళ్లు. ఆండ్రూ అకారణంగా ఉద్రిక్తు డవుతున్నాడన్న భావం వాళ్ళకు కలగక తప్ప లేదు. ఆండ్రూ విజయానికి అతని ప్రతిభ, ధృఢమైన కృషి. ఎంతగా కారణాలలో అదృష్టంకూడా అంతగా హేతువని అతని సమకాలికుల్లో కొందరు నిరంతరం విశ్వసిస్తుండేవారు. సోదరుని నూతన భావాలను అనుసరించి వ్యవహరించటానికి తాను అన్ని వేళలా సంసిద్ధుడు కాకపోయినప్పటికీ విషయమేమో టామ్ బాగా తెలుసుకున్నాడు.

"ఆండీ! త్వరపడకు. ఉక్కును గురించిన ఉద్రేకం ప్రస్తుతం ఎంతో విశేషంగా వుంది. అది ప్రమాదకరం. ఇక ఇనుమా! అన్ని అమెరికన్ పరిశ్రమలకూ అది పునాది. ఇంకా కొంతకాలం అది అలాగే వుండి తీరుతుంది. మన వ్యాపారమార్గంలోది కానిదానికోసం మనం అధిక ధనాన్ని