పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉక్కు యుగం

8

అంతర్యుద్ధ సమయం వరకూ అమెరికాలో రైలుబండ్లు ఇనుప పట్టాలమీదనే నడుస్తుండేవి. ఉక్కు పట్టాలు తొలిసారిగా 1863 లో ఇంగ్లాడునుంచి దిగుమతి అయినవి. అయితే యుద్ధం ముగిసిన తరువాత అమెరికాలో ఇనుమును ఉత్పత్తిచేసేవాళ్లు తమ దృష్టిని బెన్సిమరే విధానం మీదికి మార్చారు. బాండ్ల అమ్మకంకోసం కార్నెగీ ఇంగ్లండుకి రాకపోకలు సాగుస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఉక్కు ఉత్పత్తిని స్వయంగా చూడటం తటస్థించింది. అంతవరకూ అతడికి ఉక్కు విషయంలో ఆసక్తి లేదు. చూడగానే అతడికి ఉద్రేకం కలిగింది. న్యూయార్కులో ఓడదిగి రేవునుంచే అమాంతంగా పిట్స్‌బర్గు చేరుకున్నాడు. తన సంస్థలోని భాగస్థులను మహోల్లాసంతో యిలా హెచ్చరించాడు.

"ఇనుముకు కాలం చెల్లిపోయింది. ఉక్కు! ఇక ఉక్కే రాజు! మనం ఉక్కు పట్టాలను తయారుచేయటం మొదలుపెట్టాలి. వెంటనే మొదలుపెట్టండి!"