పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దూలాలు వంటి పెద్ద పెద్ద వస్తువులను తయారు చేసేటందు అనువుగా ఇంగ్లండులో హెన్రీ బెస్సిమర్ ఒక క్రొత్త విధానాన్ని కనిపెట్టేటంత వరకూ ఉక్కు వుత్పత్తి యెంతో నెమ్మదిగా జరుగుతుండేది. అప్పడది యెంతో కష్టమయిన పని, నిజంగా ఒక కళ. యిప్పటికి ఆండ్రూ భవిష్య జ్జీవితము నిశ్చింతగా రూపొందింది.