పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదాత్తమైన అభినయభంగిమతో వినిపించాడు. యూరపులో ఎక్కడికి వెళ్ళినా అతడు అక్కడి వ్యాపారాలను, పరిశ్రమలను, రవాణారీతులను, పరిశీలించడం మరచిపోలేదు. అందువల్ల ఈ యాత్ర అతనికి వ్యాపారాత్మక దృష్టితో చూసినా ప్రయోజనకారి అయింది. అతడు క్రమంగా పసిఫిక్ సముద్రతీరం వంకకు త్రోసుకొనివస్తున్న యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్డును గురించికూడా మరచిపోలేదు. అతడు స్కాట్‌కు వ్రాశాడు. "సెంట్రల్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ-ది వూడ్రఫ్ స్లీపర్ కంపెనీ-యూనియన్ పసిఫిక్ కంపెనీ దగ్గరనుంచి స్లీపింగ్ కార్ల కాంట్రాక్టును పొందకూడదా?" అని రోము నుంచి వ్రాశాడు. "స్కాట్ సమాధానాన్నిస్తూ" యువకుడా నీవు సమయ మేదో బహుచక్కగా ఊహిస్తావు "ప్రతిస్పర్థుల ఊహలను సమయానికి కని పెడతావు" అని ఆరంభంచేశాడు. వూడ్రఫ్‌ల కార్లను పోలిన స్లీపింగ్ కార్లకు జార్జి. ఎయ్‌వుల్మన్ పేటెంటుపుచ్చుకున్నాడు. అటువంటి పేటెంటుహక్కు అతనికి ఎలా లభ్యమైందని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పేటెంటు కార్యాలయం వారి వర్తన ఊహాతీతంగా వుంటుంది. పుల్మన్ కూడా యూనియన్ పసిఫిక్ కాంట్రాక్టుల కోసం యత్నిస్తున్నాడు. కానీ రైల్‌రోడ్ కార్యవర్గంవారు మరి రెండు సంవత్సరాలవరకూ ఈ విషయాన్ని నిర్ణయించటం వాయిదా వేశారు.

తమ్ముడు టామ్ అయిదుగురు అందగత్తె లయిన సోదరీమణులలో ఒక తెను, లూసీ కోల్మన్‌ను, వివాహం