పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హంగేరీ, స్విట్జర్‌లాండు, ఇటలీలలో పర్యటనచేశారు. ధరలు పెరిగిపోతుండటం, వెర్రిగా ఆర్ డర్లు వచ్చి పడుతుండటం కర్మాగారాలు రెండు అంచలతో పనిచెయ్యటం మొదలయిన విషయాలతో స్వదేశంనుంచి, ఇంటిదగ్గరనుంచి అతనికి వచ్చే వార్తలు ఎల్లవేళల్లో మంచివిగా వుంటుండేవి. యుద్ధానంతరోల్బణం పరిపూర్ణంగా వుంది. ప్రాచీనము, అధునాతనము అయిన చరిత్రను నిర్మించిన ప్రదేశాలలో పర్యటించటం మంచి సంగీతాన్ని వినటం కళాత్మక వస్తు ప్రదర్శనశాలను మతవిషయక మహానిర్మాణాలను, దుర్గాలను సందర్శించటం అతడు సంతృప్తితో చేశాడు. వెనిస్ నగరంలోని డోజస్ రాజసౌధం మధ్యయుగమందలి వెనిటియస్ ప్రజా రాజ్యంలోని ప్రముఖన్యాయాధిపతులు అతనిలో నిక్షప్తమయి వున్న సాహిత్యశక్తిని మేల్కొల్పటం జరిగింది. పెద్ద అంతర్మందిరంలో వున్నప్పుడు అతడు తన సహచరులను ముగ్గురను పూర్వం పాలకవర్గ సభ్యులయిన మహోద్యోగులు వాళ్ళను డోజస్ సింహాసనంలో ప్రాంక్సు అనే వారుకూర్చున్న మహాసనాల మీద కూర్చుండబెట్టి వారిముందు నిలవబడి

"Most Potent,grave and renvered signiors-

My very noble and approved goodmasters.

[ అతి శక్తిమంతులు, గంభీరులు, గౌరవనీయులయిన ప్రముఖులారా! ఘనతవహించిన ఉదారులయిన, ఉదాత్తులయిన నా యజమానులారా! అంటూ ఆరంభించి ఓధెల్లో చేసిన నివేదనాత్మ కోపన్యాసాన్ని]