పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వుత్పత్తి చేయటం కాదు. సమగ్రమైన బుద్ధి వికాసాన్ని, వుత్తమ శీలాన్ని సంపాదించటం మానవజాతి సంక్షేమం కోసం తన సంపదను వినియోగించటము అని స్పష్టంచేశాడు.

దేశంలో వున్నప్పుడు కష్టపడి, సత్య సంధతతో పనిచేశాడు. అయితే అతడిక మరణపర్యంతం పనిచేయాలన్న ఉద్దేశ్యంలేదు. కొద్ది జీతంకోసం వారానికి ఆరు రోజులు, కొన్ని సందర్భాలల్లో ఏడురోజులు గంటలతరబడి తాను శ్రమపడటాన్ని అత డెన్నడూ మరచిపోలేదు. ఇప్పు డాతడు తన ఆత్మకు పుష్టిని చేకూర్చుకోటానికి పూనుకున్నాడు. వాళ్ళమీద విడిచిపెట్టి ఎక్కడకయినా తాను నెలల తరబడి వెళ్ళినా సామర్థ్యంతోను, సత్య సంధతతోను వ్యాపారాన్ని నడిపించగలనన్న వుద్యోగివర్గం అతని కుంది. అట్టిది తనకు చేకూరిందని తన్ను గురించి తా నెప్పుడు గర్విస్తుండేవాడు. తనకు సహచరులునుగా స్వీకరింపదగ్గ శక్తి విశ్వాసపాత్రతగల వ్యక్తులు చాలామంది తన బంధువర్గంలోను బాల్య స్నేహితులలోను వుండటమనేది నిజంగా అతని అదృష్టం. అతడు వ్యాపారధోరణులు భవిష్యత్తులో ఎలా వుండబోయేది, వర్తమానంలో ఎలా నడుస్తున్నదీ గమనించటం ఎన్నడు మానివేయ లేదు.

ఫిప్స్‌కు బంధువయిన జాన్ ప్రాంక్స్ లివర్ పూల్ వద్ద ఈ ముగ్గురు యాత్రికులను కలుసుకొని ఆ యాత్రికబృందంలో చేరుకున్నాడు. నిత్యమైన యువకోత్సాహంతో తరువాత ఈ యాత్రిక చతుష్టయం ఇంగ్లండు ఫ్రాన్స్, జర్మనీ,