పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెత్తున పిట్స్‌బర్గులో కొమోటివ్ వర్క్స్‌ను స్థాపించారు. అది వీలునుబట్టి మధ్య మధ్య ఒక ఇంజనును తయారు చేస్తున్నది. ఇంతకుపూర్వపు సంవత్సరం కార్నెగీ, అతని ఇరుగు పొరుగైన విలియం కోలిమన్ సరిహద్దుదాటి, ఓహైయోలో ప్రవేశించి మరికొంత నూనెభూమిని కొన్నారు. ఇది చాలా ఫలప్రదమైనది. దీనిమూలంగా క్రొత్త పెట్టుబడులకు ఎంతో ధనం చేకూరింది. తొలిసారిగా రెండు మహా సముద్రాలను రైలుమార్గాలద్వారా కలపివేయటానికి పచ్చకమైదానం, పర్వత శ్రేణిగుండా మార్గాన్ని వేస్తున్న పసిఫిక్ యూనియన్ రైల్‌రోడ్ కంపెనీలో స్టాక్‌నుకొన్నది. ఇందువల్ల లభ్యమైన ధనం వల్లనే 1867 ఆరంభంలో సెయింట్‌లూయీ వద్ద మిసిసిపీ నదిమీద మూడు ఆర్చీలుగల సుప్రసిద్ధమైన వంతెన పనిని కీస్టోన్ బ్రిడ్జి కంపెనీ ఆరంభంచేసింది. దానికి నమూనాను తయారు చేసింది. కెప్టెన్ లిన్విల్లీ పధకాల్లో కొన్ని మార్పులుచేశాడు. తరువాతి శతాబ్దంలో మూడుపాళ్లు గడిచిన తరువాతికూడా ఆ ఇనుపబ్రిడ్జి విస్తారంగా పెరిగిపోయిన రైలుబండ్లరాకపోకల బరువును, వీథికి సంబంధించిన రాకపోకల భారాన్ని భరిస్తున్నది.

ఈ సమయంలో రచయిత బేయర్డ్ టైలర్ యూరప్‌లో కాలినడకన చేసిన ప్రయాణాలను అభివర్ణించే "వ్యూన్ ఎపూట్" అన్న పుస్తకం హోమ్‌వుడ్‌లో ఎక్కువ ప్రీతిపాత్రమయి గ్రంథంగా ఉంటుండేది. కార్నెగీ తీవ్రంగా దేశాటనం