పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆండ్రూ, అదేమిటో తెలుసుకుందా మన్నట్లుగా వారి మధ్యన తానూ తలదూర్చాడు. తండ్రి, పినతండ్రి విలియం ఇద్దరూ నవ్వుతూ ఆతడు చూడటానికి వీలుగా దాన్ని కొంచెం క్రిందికి దించారు.

"ఆండ్రా, ఇది దేశపట" మన్నాడు తండ్రి.

"దేశపటం!" అని తిరిగి ఉచ్చరించాడు ఆండ్రూ.

"ఇది అమెరికా దేశపటం" అన్నాడు గంభీరంగా తండ్రి. అతడు చిన్న బిడ్డలతోకూడా ఎప్పుడూ పెద్దవాళ్ళతో మాటాడినట్లు మాటాడుతాడు. "అదిగో అక్కడ" అని ఒక చుక్కను చూపిస్తూ అతడు "అది పిట్స్‌బర్గ్ పట్టణం. అక్కడికే అంకుల్ ఆండ్రా, ఆంట్ అన్నాలు వెళ్లుతున్నారు. అంకుల్ విలియం ఇంకా పైకి ఓహెయో రాష్ట్రంలోకి వెళ్లుతున్నాడు.

పిట్స్‌బర్గ్ అన్నది తరువాత కాలంలో ఆండ్రూ తన సంపత్తిని పెంచుకొన్న నగరంపేరు. తల్లిదండ్రులు జ్ఞప్తిచేయటంవల్ల పిట్స్‌బర్గు అన్న పేరే అతని మనస్సులో ఈ సంఘటనను స్థిరంచేసి వుంటుందనటంలో సందేహం లేదు.

జీవితకాలం మొత్తంలో యే కొద్దిమంది వ్యక్తులో పదో లేక ఇరవైయ్యో మైళ్లు తప్ప ఎన్నడూ కదలి వెళ్ళని ఒక చిన్న స్కాబ్‌నగరంనుంచి కుటుంబం వొకటి కుదుళ్ళతో సహా లేచి, సముద్రాలు దాటి, చుట్టుప్రక్కల ప్రదేశాల్లో వుండి ఇంకా ఇండియన్లు ఆపదలు కల్పిస్తున్న విశాలమూ, అజ్ఞాతమూ అయిన దేశంలో దిగి నూతన జీవితాన్ని