పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్థలోనుంచి వచ్చిన ఆదాయం అతడు తమ్ముడికోసం పెట్టుబడి పెట్టిన దానిమీద వచ్చినది.

ఆండ్రూ క్లొమన్ శక్తిమంతుడు. కానీ సుస్థిరచిత్తం కలవాడు. కొంచెం తగాదా మారి వాడు. మంచి జర్మన్ మెకానిక్. క్లోమన్‌కు అలిఘనీలో ఒక ఫౌండరీ వుంది. ఇతని ఇరుసులకు ఎంతో ప్రఖ్యాతివచ్చింది. యుద్ధం ప్రారంభం కావటంచేత ప్రభుత్వం ఇతడికి చాలా ఆర్డర్లిచ్చింది. అయితే యితడికి తన వ్యాపారాన్ని వృద్ధిచేసుకొనేటందుకు తగిన వస్తు సంపత్తి, ధనసంపత్తి లేవు.

టామ్ మిల్లర్ యితనికి తోడయినాడు. ఇరువురూ కలిసి చిన్ని కార్పొరేషనును స్థాపించారు.

కార్నెగీతో "ఆండీ! నిన్ను కూడా ఇందులోకి తీసుకు రావాలని నా కోరిక కాని క్లొమన్ దీనిని భగ్నంచేశాడు. అతడికి నీవంటే భయం. నీవు ఇందులో చేరితే మొత్తం నీపరం చేసుకొంటావనీ, లేదా నీపరం చేసుకోటానికి ప్రయత్నం చేస్తావనీ అతని అభిప్రాయం" అన్నాడు.మిల్లర్.

ఆ పరిహాసాంశాన్ని గురించి వాళ్లు నవ్వుకున్నారు. అప్పుడు వాళ్ళిరువురూ ఎంత త్వరలో ఆండీ ఇనుము వ్యాపారంలో ప్రవేశించ నున్నాడో అణుమాత్రమయినా ఊహించ లేదు.

యుద్ధశాఖ ఇరుసులకు, ఫిరంగి బండ్లకు విపరీతంగా ఆర్డర్లిస్తున్నది. వీటికే కాకుండా ఇతరమయిన వాటికికూడా