పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంవత్సరాలకు తాను ప్రారంభన మొదటి ఉక్కు కర్మాగారానికి మిష్టర్ థామ్సన్ పేరు పెట్టటం జరిగింది.

ఇరవై యో శతాబ్దపు పన్ను రేట్లతో పోల్చి చూచుకుంటే దాని తరం చాలా తక్కువే అయినా అంతర్యుద్ధం తెచ్చి పెట్టిన రాబడి పన్నుపోను 1861 లో ఆండ్రూ కార్నెగీ ఆదాయపట్టిక 47,860,67 డాలర్లు అతని రాబడి అయినట్లు చూపించింది. ఈ మొత్తం ఆశ్చర్యకరమైంది. అందులో యిది ఇరవై యేడేళ్ళ యువకుడి ఆదాయం కావటం ఎంతో విశిష్టమైన విషయం. యిందులో అతనికి డివిషన్ సూపరింటెండెంటుగా వచ్చిన జీతం ఇరవై నాలుగువందల డాలర్లు మాత్రమే. ఇందులో మరింత భాగాన్ని అతనికి నూనెమీది పెట్టుబడి తెచ్చి పెట్టింది. అతని స్లీపింగు కార్, కీస్టోస్, ఆడమ్స్ ఎక్‌స్ప్రెస్ మొదలైన పెట్టుబడులు కూడా తగినంత రాబడిని ఇచ్చాయి. మిగిలిన ఆదాయం అతనికి యితరమైన పెట్టుబడులవల్ల వచ్చింది. అతడు నిజంగా "రూపొందుతున్న స్కాచ్ వాడు" అయినాడు. ఆనాటి ఇతని తైలవర్న చిత్ర పదకొండు సంవత్సరాలకు పూర్వం తీసిన ఛాయా చిత్రపటంలోవలె అదే నిగనిగగల శాంతమైన ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. అతని జుట్టు కొంచెంగా నల్లబడ్డది. సొగసైన చిన్ని గడ్డం చేకూరింది.

అతని ఆదాయంలో మరొకపద్దు నలభై రెండువందల యాభైడాలర్లు "క్లోమన్" నుంచి వచ్చింది. ఇది కార్నెగీ ధనసంపత్తిని పెంపొందించిన మరొక వ్యాపారసంస్థ. ఈ