పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


స్కాట్లండులోని పూర్వ రంగం

1

అప్పటికి ఇంకా అతడికి రెండేళ్ళయినా లేవని పెద్దవాళ్ళు రూఢిగా చెపుతున్నా, ఆండ్రూ ఆ సంగతి తనకు జ్ఞాపకం వున్నదని ఎప్పుడూ అంటుండేవాడు. అంతేకాదు, జ్ఞాపకమున్నదనే ఆయన గాఢ విశ్వాసం.

"ఏమైనా, అది నాకు జ్ఞాపకముంది" అని గట్టిగా అంటుండేవాడు.

"నాకు జ్ఞాపకమున్న మొదటి విషయమే అది" అనేవాడు.

ఈ సంఘటనలో ఉద్రేకం పొందదగి నంతటి దేమీలేదు. అతని తల్లిదండ్రులు, మేనమామ, పినతల్లి, విలియం మారిసస్, మిసెస్ ఆండ్రూ, ఐట్కిన్ తలలుచేర్చి షుమారు రెండు అడుగుల గుడ్డమీద అంటించినటువంటి మెరిసిపోతున్న ఒక కాగితాన్ని చూస్తున్నారు. దాన్ని చుట్టటానికి అనువుగా గుడ్డకు రెండు చివరలా రెండు కర్రముక్కలు అమర్చబడి వున్నవి. గుమిగూడి చూస్తున్న వాళ్ళదగ్గిరికి తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి, చొచ్చుకొని ప్రవేశించే స్వభావంగల