పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకనాడు అంకుల్ అన్నాడు అతనితో "ఆండ్రూ ! నిన్ను శ్రమకరమైంది అడుగుతున్నానని నాకు తెలుసు. నేను దాచిపెట్టుకొన్నది తీసుకోపోయి నా కోసం అమెరికాలో పెట్టుబడిపెడితే నే నెంతో సంతోషిస్తాను" అన్నాడు.

ఈ విధంగా తనమీద భారాన్ని పడేసినందుకు ఆండ్రూ చకితుడైనాడు. "అంకుల్ డబ్బును ఏ రూపంలో పెట్టుబడి పెట్టమంటావు?" అని అడిగాడు.

"అది నీకే బాగా తెలుసు" అని సమాధానం వచ్చినది. "అయితే దాన్ని యునైటెడ్ స్టేట్స్ బాండ్లకు వినియోగిస్తే నాకు మరికొంత ఎక్కువ సంతోషం. ఎందువల్ల నంటే ఇటువంటి ఘోరమైన ప్రమాద స్థితిలో ఉన్న సమయంలో కూడా ఇలా అనటం నే నా గణతంత్ర రాజ్యాంగము మీద ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోయిన వాడిని కాకపోవటం వల్లనే.

అంకుల్ కోరినట్లుగా కార్నెగీ కొంతడబ్బును ప్రభుత్వ బాండ్లలోను, మరికొంత తనతో సంబంధమున్న అనేక వ్యాపారాలలోనూ పెట్టుబడి పెట్టాడు. చివరకు అంకుల్ లాడర్ పెట్టుబడికి మూడు రెట్ల ప్రతిఫలం వచ్చింది.

జార్జి, జూనియర్ ఇతరులతో ఎంతో ముక్తసరిగా మాట్లాడే స్వభావం గల స్కాచ్ యువకుడు, మంచి సమర్ధుడయిన మెకానికల్ ఇంజనీరు. కెల్విన్ దగ్గర చదువుకున్నాడు. ఆండ్రూన్ అమెరికన్ వ్యాపారాన్ని గురించి,ఖనిజ సంపదను గురించి అతడు అనేక ప్రశ్న లడిగాడు. అమెరికాను