పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాషింగ్టన్ చేరగానే యుద్ధశాఖలో తంతివార్తాహారులు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. యుద్ధ సేవకోసం మరి నలుగురికి ఉత్తరువులు పంపించి పిలిపించవలసిందని అధికారులు అతణ్నికోరారు. ఆతడు ఆ వుత్తరువును డేవిడ్ మెక్కార్గోకు తంతిమూలంగా పంపించాడు. అతడు ప్రస్తుతం పెన్సిల్వేనియా రైల్‌రోడ్‌కు టెలిగ్రాఫ్ సూపరింటెండెంటుగా పనిచేస్తున్నాడు. మెక్కార్గో ఆ నలుగురు ఆపరేటర్ల పేర్లను వారు వాషింగ్టన్ చేరటానికి వెంటనే ఏ మార్గాన వస్తున్నది ఒక గంటలోపల తెలియ జేశాడు. వారి వయస్సు పద్ధెనిమిది, ఇరవై మూడు మధ్య వుంటుంది. వాళ్ళలో పెద్దవాడు స్ట్రేస్, తరువాత ప్రభుత్వతంతి సమాచారశాఖకు సూపరింటెండెంటు అయినాడు.

పోటొమాక్ నది మీదుగా వర్జీనియా రాష్ట్రంలోకి వెళ్ళే బాగా దెబ్బతినిపోయిన మార్గాన్ని పునర్మించటం అతనికి తరువాతి కర్తవ్యమైంది. ముఖ్యపట్టణ రక్షణార్ధం ఆప్రాంతానికి ఫెడరల్ సైన్యం వెళ్ళెటందుకు వీలు కలిగించాలంటే ఇది ఎంతైనా అవసరం. ఉన్నతోద్యోగితోసహా అందరూ గడియారం దగ్గర పెట్టుకొని పనిచేసి పోట్‌మాక్ నది మీది పొడుగాటి పాత వంతెనను తిరిగి కొయ్యతోటే నిర్మించడం జరిగింది. చెడగొట్టబడ్డ మొత్తంమార్గాలను, వంతెనలను, తంతి తీగలను సరిచేయిస్తూ, క్రొత్తవి నిర్మిస్తూ ఆ యువకుడయిన ఉన్నతోద్యోగి ఆరువారాలు గడిపాడు.