పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వదులుచేసి నేలమీద మేకుతో గట్టిగా అంటబాతినట్లు ఆండ్రూ గమనించాడు.

"ఇక్కడ ఆపండి. నేను తంతితీగను విడుదలచేయాలి" అన్నాడు ఆండ్రూ ఇంజనీరుతో.

"దాన్ని తెగనరికారా ఏమిటి?" అప్పటికి ఇంకా గాలి బ్రేక్ రాలేదు కనుక ఆవిరిని ఆపి వెనక్కు నడుపుతూ ప్రశ్నించాడు ఇంజనీరు.

"లేదు" అన్నాడు ఆండ్రీ సమాధానంగా." ఎందుకో మరి, మేకులతో నేలకు అంట పాతటం మాత్రమే జరిగింది. తోరణంలా వ్రేలాడుతున్నా అది పని చేస్తుంది. అయితే ఇలా నేలకు బిగిస్తే పనిచెయ్యదు.

పెట్టెలోనుంచి అతడు వేగంగా క్రిందికిదిగి, మేకు దగ్గరకు వెళ్ళి, రెండుచేతులతో బలంకొద్ది మేకును నేలనుంచి బయటికిలాగాడు. బిగించిన వైరును హఠాత్తుగా విడిపించటం వల్ల ఏం జరుగుతుందో అత డప్పు డూహించలేదు. అతని మొగాన గట్టిదెబ్బకొట్టి పైకి ఎగిసిపడ్డది. అతడి చెక్కిలిమీద అడ్డంగా లోతున గీచుకుపోవటంవల్ల నెత్తురు విపరీతంగా కారింది. నెత్తురులో నిండిపోయిన చేతిగుడ్డను మొగాన అడ్డుపెట్టుకొని సైన్యంతో అతడు వాషింగ్టన్ ప్రవేశించాడు. అతర్యద్ధంలో యూనియన్ కోసం తొలిసారిగా నెత్తురును ఒలికించిన వాణ్ని నేనని అతడు తరువాతకాలంలో నవ్వుతూ అంటుండేవాడు.