పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దళాన్ని కూర్చుకొని మిలిటరీ రైల్‌రోడ్, టెలిగ్రాఫ్‌ల పని చూచేటందుకు సహాయకుడవుగా రమ్మని పిలిపించాడు. ముసాచ్యు సెట్స్‌నుంచి దక్షిణానికి చేరవలసిన సైన్యం బాల్టిమోర్ మీదుగా వెళ్లుతున్నప్పుడు ఒక మూక ఎదుర్కొన్నది. అనేకచోట్ల రైల్వేలైను తెగగొట్టి, వంతెనలను తగలేసి అదిమార్గాలన్నింటినీ పాడుచేసింది. ఏప్రియల్ 19 తరువాత ఒక వారానికి వాషింగ్‌టన్‌కు, ఉత్తరానికీ మధ్య వార్తాప్రసారం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. ఇది చాలా విషమమైన పరిస్థితి.

ఆ మార్గాన్ని తిరిగి సరిచేయించటం కార్నెగీకి నిర్ణీతమైన ప్రథమ కర్తవ్యం. ప్రయాణం చేయవలసిన సైన్యంలో నుంచి ఎన్నుకొన్న మనుష్యులను, ఒక ఇంజనీరింగ్ దళాన్ని అతడు కనికరమన్నది ఎరగకుండా తరిమి పనిచేయించాడు.

వారాంతంలో బండ్లు తిరిగి నెమ్మదిగా దక్షిణానికి వెళ్ళటం ప్రారంభించాయి. కట్టలను మధ్యమధ్య ధట్టించటానికి ఎంతో ఘనమయిన భారాలను మోయగలందుకు వాటిని బలకరం చెయ్యటానికి తన మనుష్యులను అక్కడ ఆపుదలచేసి నిండా సైనికులున్న రైలుబండి ఇంజన్ పెట్టెలో కూర్చుని తాను బాగుచేయించిన రోడ్డుమీదుగా వాషింగ్టన్ వైపుకు ప్రయాణంచేశాడు. బండిమీద విద్రోహచర్య ఏదైనా జరుగుతుందేమో అన్న భయంతో వాళ్లు అతిజాగరూకులై వెడుతున్నారు. వాషింగ్టన్ ఇంకా చాలామైళ్ళ దూరానవుంది. వున్న ఒక్క తంతితీగను స్తంభాలనుంచి