పుట:Aandhrashaasanasabhyulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్నూలు జిల్లా

మహబూబ్ ఆలీ ఖాన్

కాంగ్రెస్: కర్నూలు నియోజకవర్గం, జననం: 1890, విద్య: మూడవఫారం, పర్షియన్, అరబిక్ భాషలలో స్కాలర్, 1918 రాజకీయాలలో ప్రవేశం, డైరక్టరు, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, హనుమాన్ కో ఆపరేటివ్ స్టోర్సు, హౌస్ కన్‌స్ట్రక్షన్ సొసైటీ, 1947 -52 కర్నూలు మునిసిపల్ చైర్మన్, ప్రస్తుతం కౌన్సిల్ సభ్యుడు, సిటీ ఇంప్రూవ్‌మెంటు బోర్డు, రాజధాని కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రా ముస్లిం కల్చరల్ అసోసియేషన్, ఉస్మానియా కాలేజి మేనేజింగ్ కమిటీ సభ్యుడు, ఆరబిక్ కాలేజీ, కర్నూలు ధర్మకర్త, ప్రత్యేక అభిమానం: ప్రజాసేవ, అడ్రస్సు: కర్నూలు.

నక్కా వెంకటయ్య

కాంగ్రెస్ : ఎఱ్ఱగొండపాలెం నియోజకవర్గం, జననం: 19-6-1909. విద్య: బి.ఎ.,ఎ.ఆర్.ఐ. 4 సం.లు కిర్లంపూడి పంచదార ఫ్యాక్టరీ జనరల్ మేనేజరు. 6 సం.లు సామర్లకోట పంచదార ఫ్యాక్టరీ కెమిస్టు, 8 సంవత్సరములుగా ఉయ్యూరు పంచదార ఫ్యాక్టరీ చీఫ్ కెమిస్టు, ఆంధ్రా సిమెంటు కంపెనీ కన్‌సల్‌టింగ్ కెమిస్టు. 1952 ఎన్నికలలో లోక్ పార్టీ అభ్యర్ధిగా శాసనసభకు ఎన్నిక. ప్రత్యేక అభిమానం: పరిశ్రమలు, వాటి అభివృద్ధి, అడ్రస్సు: మార్కాపురం, కర్నూలు జిల్లా.

పిడతల రంగారెడ్డి

కాంగ్రెస్ : గిద్దలూరు నియోజకవర్గం, జననం: 9-10-1917. విద్య, స్కూలుఫైనలు, 20 సం.లు జాతీయోద్యమాలలో జైలుశిక్ష. ఇదివరలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ సంఘం అధ్యక్షుడు. పార్లమెంటు సభ్యుడు, 1952 ఎన్నికలలో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభకు కంభం నియోజకవర్గం నుండి ఎన్నిక, అడ్రస్సు: గిద్దలూరు.