పుట:Aandhrashaasanasabhyulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృష్ణా జిల్లా


కాంగ్రెస్, విజయవాడ దక్షిణ నియోజకవర్గం, జననం: 21-1-1881, విద్య: బి.ఎ., బి.యల్., 1906-1921 న్యాయవాదవృత్తి, 1919లో గాంధీజీ ' రౌలత్ ' సత్యాగ్రహయాత్ర సందర్భములో విజయవాడ వచ్చినప్పుడు వారి సహచరుడుగా చేరి వందేమాతరం " హోమ్‌రూల్ " మొదలగు గాంధీజీ ఉద్యమాలలో --కృషి, 1921, 30, 32, 33, 40, 42, జాతీయోద్యమాలలో జైలుశిక్ష, 1917 నుండి, ఎ. ఐ. సి. సి. సభ్యుడు 10 సం, 6 నెలలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. 4 సం, ఉపాద్యక్షత. రెండుసార్లు మునిసిపల్ ఛైర్మన్ గా ఎన్నిక జైలుకి వెళ్లిన సందర్భములో ఛైర్మన్ పదవికి రాజీనామా, విడుదల అనంతరం, " విజయవాడ స్చేఛ్ఛాపౌరసత్వం " ప్రదానం, 1926-29 మద్రాసు శాసనసభకు ఎన్నికై స్థానిక సంస్థలకు నామినేషన్ పద్ధతి రద్దుకు బిల్లు ప్రతిపాదన, 1937-39 మద్రాసు శాసనసభకు ఎన్నిక, ఆకాలంలో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, 1946-51 తిరిగి మద్రాసు శాసన సభ్యుడుగా ఎన్నిక, ఆంధ్రవిశ్వవిద్యాలయము సెనేట్, సిండికేట్ సభ్యుడు, విజ్ఞానచంద్రికామండలి స్థాపన, బహుగ్రంథకర్త, ఆంధ్రదేశములో గ్రామీణ గ్రంథాలయ ఉద్యమములోను, హిందీప్రచార ఉద్యమములోను కృషి, విశాలాంధ్ర మహాసభ స్థాపన. దాని అధ్యక్షత, ప్రత్యేక అభిమానం, గాంధీగారి సిద్ధాంతప్రకారము శ్రేయోరాజ్య స్థాపన. అడ్రసు: గవర్నరుపేట, విజయవాడ-2, ఫోను, నెం. 131.

మురుపిళ్ళ చిట్టి