Jump to content

పుట:Aandhrashaasanasabhyulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసనసభకు స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నిక, 1954 మేనెలలో ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి శ్రీకృష్ణ భాగవతము కృతిస్వీకరణ, ప్రత్యేక అభిమానం : దైవభక్తి, అడ్రస్సు : తంగేడు, ఉరట్ల పోష్టు.

ముత్యాల పోతురాజు

కాంగ్రెస్ : నర్సీపట్నం (రిజర్వుడు) నియోజకవర్గం, వయస్సు : 45 సం|| విద్య : 8వ తరగతి, 1921 కాంగ్రెస్ లో ప్రవేశించి, హరిజనుల విద్యాభివృద్ధి, అశ్పృస్యతా నివారణకు కృషి, తాలూకా హరిజన సంఘం ప్రెశిడెంటు, పట్టణ కాంగ్రెస్, ఎడ్యుకేషన్ కమిటీ, పంచాయితీ బోర్డు, మెంబరు, ప్రత్యేక అభిమానం : గాంధీగారి ఆశయ ఆదరణ, అడ్రస్సు : నర్సీపట్నం, గొలుగొండ తాలూకా.

గుజ్జల రామునాయుడు

ప్రజా సోషలిస్టు : శృంగవరపు కోట; రిజర్వుడు, నియోజకవర్గం జననం : 1901 అధ్యక్షుడు, అనంతగిరి కో ఆపరేటివ్ సొసైటీ, సభ్యుడు : ఏజన్సీ డెవలప్ మెంటు బోర్డు ప్రత్యేక అభిమానం : వ్యవసాయము, వేట. అడ్రస్సు : శృంగవరపుకోట పోస్టు.

బి. జి. యం. నరసింగరావు